Happy Bday Ananya Nagalla : 'అన్వేషి' టీమ్

'మల్లేశం' 'వకీల్ సామ్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు రానున్నారు. 'అన్వేషి' అనే స్మాల్ బడ్జెట్ సినిమాతో సినీ ప్రేక్షకులను మరోసారి అలరించబోతున్నారు. తాజాగా అనన్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనన్య.. బ్లూ సారీలో పూల చెట్ల మధ్యలో అందంగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను, 'ఏదో ఒక కలవరం' అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే వరల్డ్ లేబర్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను కూడా లాంచ్ చేసారు. చిన్న సినిమాలకి ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలిచే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు.. 'అన్వేషి' చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీమ్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు. సస్పెన్స్ మరియు మిస్టరీతో నిండిన ప్రపంచాన్ని అన్వేషించడానికి మీరు ఎగ్జైటింగ్ గా ఉన్నారా? అయితే ఇది మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టే రోలర్ కోస్టర్ రైడ్ లో ఒక చిన్న గ్లిమ్స్' అని మేకర్స్ టీజర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేశారు.
'అన్వేషి' చిత్రానికి వీజే ఖన్నా దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే ట్రైలర్ ను లాంచ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన అనన్య.. చిత్ర పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి ముందు ఇన్ఫోసిస్‌లో పనిచేసింది. ఆ తర్వాత పలు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు 2019లో మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలా ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో లాంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. ఆమెకు బాగా పేరు తీసుకువచ్చిన చిత్రాల్లో వకీల్ సాబ్, శాకుంతలం ఉంటాయని చెప్పవచ్చు.
Team #Anveshi wishes the dazzling beauty and stellar performer @AnanyaNagalla a very Happy Birthday ❤️🔥#HBDAnanyaNagalla @VijayDharan_D@SimranG18401460@v_j_khanna @chaitanmusic @simonkking @GanapathiReddy_@arunasreeEnts@Ananthkancherla@WallsAndTrends@durgesh_vt… pic.twitter.com/QNcfyrnVA3
— T-Series South (@tseriessouth) August 1, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com