Bellamkonda Sai Srinivas : శ్రీనివాస్ ఈ యేడాది మెరిసేలా ఉన్నాడు

Bellamkonda Sai Srinivas :  శ్రీనివాస్ ఈ యేడాది మెరిసేలా ఉన్నాడు
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తండ్రి సురేష్ నిర్మాత. అందుకే శ్రీనివాస్ కు హీరోగా గ్రాండ్ ఎంట్రీ లభించింది. ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీనుతో ఇంప్రెషన్ వేశాడు. మంచి డ్యాన్సులు వేయగలడు. యాక్షన్ లో ఈజ్ ఉంది. కాకపోతే నటన, డైలాగ్ డెలివరీ బెటర్ కావాలన్నారు చాలామంది. ఈ విషయంలో ఇంకా వంద మార్కులు సంపాదించుకోలేదు కానీ.. తన వంతుగా చాలానే కష్టపడుతున్నాడు. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల రేంజ్ లో హిందీ డబ్బింగ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. జయ జానకి నాయక, సాక్ష్యం వంటి యాక్షన్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు. రాక్షసుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాకపోతే ఛత్రపతి హిందీ రీమేక్ ఓ పెద్ద పొరపాటు. అందుకే కాస్త టైమ్ తీసుకుని సరిదిద్దుకుని ఇప్పుడు వరుస సినిమాలతో రాబోతున్నాడు. ఇవన్నీ ప్రామిసింగ్ గా ఉండటం విశేషం. శ్రీనివాస్ ముందు నుంచీ మాస్ హీరో అనే ఉద్దేశ్యంతోనే కథలు కమిట్ అవుతున్నాడు. ఇందువల్ల హిట్టెక్కలేకపోతున్నాడు. ఇది కాదని రూట్ మార్చి సీత లాంటి సినిమా చేస్తే డిజాస్టర్ అయింది. సో అతను నమ్మిన మాస్ మంత్రమే కరెక్టేమో అనిపిస్తే తప్పేం లేదు. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకూ అంటే ఇవాళ(శుక్రవారం) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు.ఈ బర్త్ డే అతనికి చాలా స్పెషల్ అనే చెప్పాలి. తను నటిస్తోన్న మూడు సినిమాలు ఈ యేడాదే విడుదల కాబోతున్నాయి. ఇవన్నీ ష్యూర్ షాట్స్ లా కనిపిస్తున్నాయి.

భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో నటించిన టైసన్ నాయుడు వీటిలో ముందుగా రాబోతోంది. ఇది కాస్త డిఫరెంట్ కంటెంట్ లా కనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడింది. కాకపోతే ఇంకా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన క్లియర్ అప్డేట్స్ రావాల్సి ఉంది.

తమిళ్ లో హిట్ అయిన గరుడన్ ను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర శ్రీనివాస్ దే. నాంది, ఉగ్రమ్ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఇంకా నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్. శ్రీనివాస్, అదితి కాంబోలో వచ్చిన పాట ఆకట్టుకుంటోంది.

ఇక దీంతో పాటు లుధీర్ బైరెడ్డి డైరెక్షన్ లో ఓ ఫాంటసీ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇది శ్రీనివాస్ కు 12వ సినిమా. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మొత్తంగా ఈ మూడు సినిమాలూ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. వీటిలో ఏ రెండు బ్లాక్ బస్టర్ అయినా శ్రీనివాస్ కెరీర్ గాడిలో పడుతుంది. కాకపోతే ఈ మూడూ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ యంగ్ స్టర్ టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

Tags

Next Story