Happy Birthday Gautam Memon: పుట్టిన రోజు శుభాకాంక్షలు గౌతమ్ మీనన్
లవ్, యాక్షన్ సినిమాలతో తనదైన ముద్రవేసిన దర్శక దిగ్గజం గౌతమ్ వాసుదేవ్ మీనన్. ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాంటి "ప్రేమ" పూర్వక దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది యావత్ సినీప్రపంచం. గౌతమ్ మీనన్ తన తొలి రోజులలో రాజీవ్ మీనన్ దగ్గర పలు యాడ్ ఫిలిమ్స్ తో పాటు, 'మెరుపు కలలు' సినిమాకు పనిచేశారు.
అబ్బాస్, రీమాసేన్ నటించిన 'చెలి' సినామాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు గౌతమ్ మీనన్. ఈ సినిమా హిట్ అవడంతో గౌతమ్ పేరు మార్మోగిపోయింది. సూర్య హీరోగా 'కాక్క కాక్క' సినిమాతో యాక్షన్ జోనర్ లోకి ప్రవేశించారు. ఈ సినిమాను వెంకటేష్ హీరోగా 'ఘర్ణణ' పేరుతో రిమేక్ చేశారు. గౌతమ్ మీనన్ సినిమాలో అందమైన సంభాషణలు, స్త్రీ పాత్రల ఔన్నత్యం, బలమైన, సహజమైన వర్ణనలతో ప్రేమకథలను రూపొందించడంలో గౌతమ్ కు పెట్టింది పేరు. ఇటీవల యాక్టర్ గానూ పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గౌతమ్ మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ చిత్ర యునిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com