Samantha: ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను : సమంత ఎమోషనల్ పోస్ట్

Samantha: ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను : సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha: అనేక సందర్భాల్లో మీరు నాకు తోడుగా ఉన్నారు.. మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు.

Samantha: కొందరి పుట్టిన రోజులు మరచిపోలేని జ్ఞాపకాలు.. మధురానుభూతులను గుర్తు చేస్తాయి. వారితో గడిపిన క్షణాలు తమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, ఊపిరిని అందిస్తుంది. మహిళా దర్శకురాలు నందినీ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ 2012లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది సమంత.


తన జీవితంలో నందిని ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చెబుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ' నా ప్రియ మిత్రురాలు నందినీ రెడ్డి.. మీ మంచితనమే మీ గొప్పతనం. మీరు నాకు స్ఫూర్తి. నాకు అది నిన్నటిలాగే గుర్తుంది. అది 2012 సంవత్సరం. నేను బాగా లేను. నాలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంది. నిరాశ, నిస్పృహతో తిరిగి షూటింగ్స్‌లో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు.

ఆ సమయంలో మీరు ప్రతి రోజు నా దగ్గరకు వచ్చి, మీ విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు.. నాలో విశ్వాసాన్ని నింపడానికి నాతో టెస్ట్ షూట్ ప్లాన్ చేశారు. ఆ ఉత్సాహంతో మరుసటి రోజు నేను ఎలా తిరిగి పని చేశానో ఎప్పటికీ మరిచిపోలేను. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మీరు నాకు తోడుగా ఉన్నారు.. మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నాకు ప్రేరణగా నిలుస్తున్నారు.. థ్యాంక్యూ నందినీ..


ప్రతిరోజూ మంచి స్నేహితుడిగా ఉండటానికి మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు. నన్ను నమ్మినందుకు, నాపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ రాబోయే పుట్టినరోజులు మరింత ప్రకాశవంతంగా ఉండాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సమంత నందినీ రెడ్డికి పోస్ట్ పెట్టింది. నందనీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఓ బేబీ' సినిమా సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.


Tags

Next Story