Happy Birthday Nagarjuna: 64 ఏళ్ళు వచ్చినా మన్మథుడే మరి...

'మన్మథుడి'గా పేరు గాంచిన హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నేడు(ఆగస్టు 29). ప్రేక్షకుల హృదయాల్లో 'కింగ్' గా నిలిచిపోయిన ఈ హీరో.. 1986లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన ఆయన.. అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. మూడు దశాబ్దాలకు పైగా విజయవంతమైన సినీ కెరీర్‌లో, నాగార్జున మారుతున్న కాలానికి అనుగుణంగా, నటనతో ఆకట్టుకుంటూ మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు. 64ఏళ్ల వయసులో ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు నాగార్జున. ఇప్పటికీ ఆయన అంత ఫిట్ గా ఉండడం, ఎలాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించకపోవడమే అందుకు ఉదాహరణ.
నాగార్జున మొదట్లో అన్నా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తరువాత తన చదువును మిచిగాన్‌లోని యప్సిలాంటిలోని ఈస్టర్న్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో విద్యనభ్యసించాడు. 1984లో ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు, 1990లో ఈ జంట విడిపోయారు. తదనంతరం, నాగార్జున నటి అమలను 11 జూన్ 1992న వివాహం చేసుకున్నారు. నాగార్జునకు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని అనే ఇద్దరు కొడుకులున్నారు. వారిని, నాగార్జునను పక్కపక్కన నిలబెడితే అన్నాదమ్ముల్లలా ఉంటారంటే అతిశయోక్తి కాదు. స్టైల్లో, నటనలో.. వారితో పాటు సమానంగా దూసుకుపోతున్నాడు నాగార్జున.
టబుపై రూమర్లు
నాగార్జున, అమలను పెళ్లి చేసుకున్న సమయంలో టబుతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వారి సంబంధం ఒక దశాబ్దం పాటు కొనసాగింది. అయితే నాగార్జున తన భార్యను విడిచిపెట్టి ఆమెను వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో టబు ఆ రిలేషన్ షిప్ ను ముగించాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
బ్లూ క్రాస్
నాగార్జున.. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే NGO సహ-వ్యవస్థాపకులలో ఒకరు. ఇది జంతు సంరక్షణపై దృష్టి సారిస్తుంది, జంతు హక్కుల కోసం పోరాడుతుంది.
నో హిట్..
నాగార్జున గత కొంతకాలంగా హిట్ కొట్టేందుకు భారీగానే కష్టపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఆయన ప్రస్తుతం తన తదుపరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com