HBD NTR : మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!

HBD NTR :  మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!
HBD NTR : కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు.

HBD NTR : కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. మొదట జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ కు ఏ మాత్రం తీసిపోడని ఎప్పుడో నిరూపించుకున్నాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా రక్తి కట్టించడంలో తన తర్వాతే ఇంకెవరైనా అని ప్రేక్షకుల చేతా అనిపించుకున్నాడు. రీసెంట్ గా కొమురం భీమ్ లా ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన యంగ్ టైగర్ పుట్టిన రోజు ఇవాళ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పసితనంలోనే రాముడయ్యాడు. నిన్ను చూడాలని వెండితెర తహతహలాడుతోంటే.. పసితనపు ఛాయలు వీడకుండానే ఆదిగా అదరగొట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ అతను. సింహాద్రిగా సింహగర్జన చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ కు సునామీని చూపించిన ప్రతిభావంతుడు. వరుస విజయాలతో సరికొత్త స్ట్రాటజీ చూపిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ఈ తరంలో దొరికిన నటనా ఆణిముత్యం. ఎన్టీఆర్ తరపు హీరోల్లో అతన్లా అన్ని రసాలనూ పండించే హీరో మరొకరు లేరు అంటే అతిశయోక్తేం కాదు. ఆ విషయాన్ని రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లో భీముడులా భారతదేశానికీ చూపించిన మోస్ట్ టాలెంటెడ్ స్టార్ అతను.

వారసత్వం ఎంట్రీ కార్డ్. తర్వాత టాలెంటే ఫైనల్. నిన్ను చూడాలనితో రామోజీ రావు తారక్ ను హీరోగా పరిచయం చేశాడు. సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇతను హీరో ఏంటీ, వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అన్నారు. ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం.. మరీ లేతగా కనిపించడం.. ఆ కథలో ఏ కొత్తదనం లేకపోవడంతో పాటు సినిమా ఆడకపోవడం వంటి కారణాలన్నీ ఈ విమర్శలకు కారణం. అసలు అతను హీరోగా కంటిన్యూ కావాలా వద్దా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్.. పెద్దాయన వారసుడిగా వచ్చాడు. సాధారణం సినిమాలు చేస్తే సరిపోదు. హిట్లు మాత్రమే కాదు.. ఏం హిట్టు కొట్టాడ్రా అనే పేరు కావాలి. ఈ సారి మరో కొత్త దర్శకుడు వచ్చాడు. సరిగ్గా పంతొమ్మిదేళ్లు మాత్రమే ఉన్న ఈ బుడ్డోడిని నమ్మి అతి పెద్ద సినిమా చేశాడు. ఇది అప్పటికి తారక్ కెపాసిటీకి అస్సలు సరిపోయే కథ కాదు. కానీ చేశాడు. ఎందుకంటే అతను ఎన్టీవోడి వారసుడు కదా. అదే ఆది. ఆదితో అతను తొడగొడితే బాక్సాఫీస్ ఉలిక్కి పడింది.

మళ్లీ రాజమౌళి రంగంలోకి దిగాడు. విజయేంద్ర ప్రసాద్ కథ. ఈ కథలోని వెయిట్ కూ ఎన్టీఆర్ స్టామినా సరిపోదనుకున్నారు. కానీ అతని నటన చూసిన తర్వాత అప్పటి వరకూ అతన్ని లైట్ తీసుకున్న టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా తమ స్టార్డమ్ ను తడుముకున్నారంటే అతిశయోక్తి కాదు. సింహాద్రిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఇది. ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్లిపోయాడు. అంత చిన్న వయసులో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. సింహాద్రి తర్వాత టాలీవుడ్ నెంబర్ గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది.

సింహాద్రి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్టార్డమ్ ను ఎన్టీఆర్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది. వరుస గా ఫ్లాపులు. ఓ దశలో ఇతనేనా సింహాద్రి చేసింది అనిపించాడు. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహా, అశోక్, రాఖి.. ఇలా చేసిన ప్రతి సినిమా పోయింది. అన్ని సినిమాలూ సింహాద్రి కావాలనే ఆరాటం కనిపిస్తుంది. ఇవి పోవడానికి ఇదో కారణం అనుకోవచ్చు. వీటిలో రాఖి ఫర్వాలేదనిపించినా.. ఆ టైమ్ లో ఎన్టీఆర్ మరీ లావైపోయాడు. ఇది కూడా కొంత మైనస్ గా మారింది.

యమదొంగ తర్వాత మళ్లీ ఆది దర్శకుడుతో అదుర్స్ అనిపించాడు. అదుర్స్ లో అతని నటన చూస్తే ఈ తరపు నవరస నాయకుడు అని ఎందుకు అంటారో తెలుస్తుంది. అప్పటి వరకూ ఊరమాస్ డైలాగ్స్ చెబుతూ కాస్త రూడ్ గా ఉండే పాత్రలు చేసిన ఎన్టీఆర్ చారీగా చేసిన హడావిడీకి పడిపడి నవ్వారు. అతన్లోని ఈయాంగిల్ చిరంజీవి చంటబ్బాయ్ ని గుర్తుకు తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. దీని తర్వాత బృందావనంలో ఫ్యామిలీ స్టార్ గా మారాడు. ఈ రెండు సినిమాలు తనలోని క్లాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాయి.

ఎన్టీఆర్ గొప్ప నటుడు. నోడౌట్. కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు. ఇదీ కంప్లైంట్. దీంతో అతను రీ థాట్ లో పడ్డాడు. అదే టైమ్ లో ఆడియన్స్ టేస్ట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వారి టేస్ట్ కు అనుగుణంగా మారకపోతే ఎన్టీఆరే కాదు.. ఏ హీరో మనుగడైనా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. దీంతో రూట్ మార్చాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి, ఈ సారి తనలోని మరో యాంగిల్.. టెంపర్ చూపించాడు. ఆడియన్స్ కు ఆ టెంపర్ నచ్చింది. క్లైమాక్స్ తో మరోసారి తానెంత గొప్ప నటుడో చూపించాడు.

కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా.. అనౌన్స్ అయినప్పుడే అంచనాలు పెంచింది. పైగా త్రిపాత్రాభినయం. ఇంకేముందీ ఎన్టీఆర్ నట విశ్వరూపం గ్యారెంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ పాత్రలో నత్తితో నటించాడు. ఇక క్లైమాక్స్ లో అతని నటనకు కన్నీళ్లు పెట్టని వారు లేరు. మూడు పాత్రల్లో అతను చూపిన వేరియేషన్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు ఓ లెస్సన్. ఆ స్థాయిలో ఆట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story