బాలనటుడి నుంచి సూపర్ స్టార్ వరకు మహేశ్ సినీ ప్రస్థానం

బాలనటుడి నుంచి సూపర్ స్టార్ వరకు మహేశ్  సినీ ప్రస్థానం

Mahesh Babu Twitter Image

HBD Mahesh babu: మహేష్ బాబు నేడు 46వ వసంతంలోని అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మహేష్ బాబు నేడు 46వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్ వరకు ఎదిగిన విశేషాలు మీకోసం.


1975 ఆగస్ట్ 9న చెన్నైలో హీరో కృష్ణ, ఇందిర పుట్టిన సంతానంలో చిన్నవాడు మహేశ్ బాబు.



మహేష్ తన 4వ ఏట దర్శకరత్న దాసరి దర్శకత్వంలో వచ్చిన 'నీడ' చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు.


మహేష్ అలా చిన్నప్పడే నటుడిగా తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను పదును పెట్టాడు. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పలు చిత్రాల్లో నటించాడు.


కృష్ణ దర్శకత్వంలో 5 సినిమాలు చేశాడు.


మహేష్ హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది.



ఈ సినిమాలో ప్రీతి జింటాతో స్ర్రీన్ షేర్ చేసుకున్నాడు. కే.రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, ఏ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ,బి.గోపాల్ దర్శకత్వంలో సినిమాలు చేసిన నేటి తరం హీరో మహేష్ బాబు



వంశీ మూవీలో హీరోయిన్ గా నటించిన నమ్రత రియల్ లైఫ్ పార్టనర్ అయ్యింది.


గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన 'ఒక్కడు' ఒక సెన్సెషనే క్రియేట్ చేసింది. 2003లో వచ్చిన ఒక్కడు సినిమాలో మహేశ్ అద్భుతంగా నటించాడు



'అతడు' మూవీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. ఈ సినిమాలో నటకు రెండోసారి నంది అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు.





మహేష్ - కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీ మురారి. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.


మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ. కథనం స్లోగా ఉండటంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. మహేష్ ఈ సినిమాలో నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.




నాని సినిమాలో వైవిద్య భరిత పాత్రను పోషించాడు మహేశ్. ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతి పై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది.



నాని సినిమాలో వైవిద్య భరిత పాత్రను పోషించాడు మహేశ్. ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతి పై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది.



పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. మహేష్ నోటి నుంచే మాటలు తూటాలై పేలాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అంటూ మహేశ్ చెప్పే డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మహేష్ స్టామినా ఏంటో తెలియజేసింది.



శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మూవీ దూకుడు మహేశ్ కెరీర్ లోనే భారీ విజయంగా నిలబడింది. తమన్ మ్యూజిక్ సూపర్ హిటైంది. బిజినెస్ మేన్ మమేష్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.



విక్టరీ వెంకటేశ్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మహేష్ బాబు.



ప్రత్యేక చిత్రంగా నిలిచినపోయిన శ్రీముంతుడు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనతో వచ్చిన ఈ మూవీ విమర్శుల ప్రశంసలు అందుకుంది. అందరిని ఆలోచింప చేసింది.



కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా 'భరత్ అను నేను'. ఈమూవీలో మహేశ్ బాబు తొలిసారి సీఎం పాత్రలో అదరగొట్టారు మహేష్ బాబు. ఒక యువకుడు సీఎం అయితే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయోచ్చో ఈ సినిమాలో ఉంటుంది. మహేశ్ లుక్ ఈ సినిమాలో హైలెట్.



మహర్షి సినిమాలో అన్నదాతల గొప్పతనాన్ని ఆవిష్కరించిన 'మహర్షి'. అల్లరినరేశ్ ఈ సినిమాలో మహేశ్ స్నేహితుడిగా నటించాడు.


మహేశ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీలో విజయశాంతి కూడా నటించారు.



'భరత్ అను నేను', 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస సక్సెస్‌లతో హాట్రిక్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు



మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో పలకరించబోతున్నాడు. సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు బర్త్‌డే రోజు అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న 'సర్కారువారి పాట' నుంచి స్పెషల్‌ వీడియో రిలీజ్ చేశారు.


Tags

Next Story