సినిమా

Happy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Happy Birthday Jr NTR: సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ఇష్టపడే నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు

Happy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
X

Happy Birthday Jr NTR: సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ఇష్టపడే నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. RRR, యమదొంగ, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలలో అతడు చూపించిన యాక్టింగ్ స్కిల్స్ కి అభిమానులు అచ్చెరువొందారు. అతడిపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమ దక్షిణ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అతడు నటించిన RRR చూసి ముగ్ధులయ్యారు. అతడి నటనను ప్రశంసించారు. ఈ రోజు అతనికి చాలా ప్రత్యేకమైన రోజు అదే అతడి పుట్టినరోజు. అతని అభిమానులు, పలువురు ప్రముఖులు నటుడిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ వేదికగా తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ RRR సహనటుడు అజయ్ దేవగన్ ట్విట్టర్‌లోకి వెళ్లి అతనితో దిగిన ఓ బ్యూటిఫుల్ పిక్ ని పంచుకున్నారు. అజయ్ తన హృదయపూర్వక సందేశంతో పాటు, "హ్యాపీ బర్త్‌డే @tarak9999. #RRR సమయంలో మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

నేను మీకు ఎప్పటికీ ఇలాగే ఆనందం, ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ అభిమాను హృదయాలను గెలుచుకునే చిత్రాలు చేస్తారని, చెయ్యాలని కోరుకుంటున్నాను అంటూ అజయ్ పోస్ట్ పెట్టారు.

"తమ్ముడు, సహనటుడు, స్నేహితుడు ... నాకు మీరు ఎవరో నిర్వచించిన పదాలు కావు ఇవి.. నా హృదయంలో నుంచి వచ్చినవి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

నటుడు సాయి ధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని ట్వీట్ చేస్తూ, "తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు ప్రేమ, ఆనందం, విజయాలతో నిండి ఉండాలి." అని రాసుకొచ్చారు.

ఇండస్ట్రీకి చెందిన మరికొంత మంది ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ తారక్ ని విష్ చేస్తున్నారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.


Brother, co-star, friend … I don't think words can define who you are to me @tarak9999 !

Next Story

RELATED STORIES