Tollywood: 'హర ఓం హర' సినిమా టైటిల్ లోగో రిలీజ్

Tollywood: హర ఓం హర సినిమా టైటిల్ లోగో రిలీజ్
X

'హర ఓం హర' సినిమా టైటిల్ లోగోను హీరో సుమన్ విడుదల చేశారు. ఈ సినిమాలో కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది. టైటిల్ లోగో రిలీజ్ చేసిన అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. దర్శకుడు ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని అన్నారు.

టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. 'హర ఓం హర సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు షేర్‌కు అభినందనలు. షేర్ తెలుగులోనే కాకుండా అన్ని భాషల చిత్రాలను తెరకెక్కించే స్థాయికి చేరుకోవాలి. షేర్ ప్రతిభ ప్రపంచస్థాయికి వెళ్లాల'ని కోరుకున్నారు. కావేటి ప్రవీణ్ కెమెరామెన్‌గా, షేర్ దర్శకత్వ బాధ్యతలతో పాటు సంగీత దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. డీవీ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్‌, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్‌ నాగ్, షేర్ స్క్రీన్ ను పంచుకున్నారు.

Tags

Next Story