Pawan Kalyan : హరిహర వీరమల్లు.. ఆ డేట్ నే ఫిక్స్ చేశారు

Pawan Kalyan :  హరిహర వీరమల్లు.. ఆ డేట్ నే ఫిక్స్ చేశారు
X

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు రవితేజ మాస్ జాతర మూవీ కూడా ఉంది. దీని వల్ల రవితేజకు పవన్ కళ్యాణ్ ఎసరు పెడుతున్నాడా అంటూ టివి5 మూడు రోజుల ముందే రాసిన వార్తను నిజం చేస్తూ ఈ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 28న విడుదల చేయాలని నిర్మాత ఏఎమ్ రత్నం ఎంతో పట్టుదలగా ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. పోస్ట్ పోన్ అవుతుందని కూడా చాలమంది ముందే ఊహించారు కూడా. దానికి కారణం ఈ 28న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ ఉన్నాయి. ఆ డేట్స్ లో ఏ మార్పూ లేకపోవడమే.

ఇక క్రిష్ కొంత భాగం దర్శకత్వం చేసిన హరిహర వీరమల్లు మిగతా భాగాన్ని ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్, రోషనారా గా నర్గీస్ ఫక్రీ కనిపించబోతోంది. ఇతర పాత్రల్లో సత్యరాజ్, నోరా ఫతేహి నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా హోలీ సందర్భంగా హరిహర వీరమల్లును మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. మరి ఆ డేట్ కైనా వస్తుందా లేక ఇంకేవైనా ట్విస్ట్ లు ఉంటాయా అనేది చూడాలి.

Tags

Next Story