HariHaraVeeraMallu Song : హరిహర తార తార సాంగ్ ఆకట్టుకుందా

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తార తార సాంగ్ రిలీజ్ అయింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని ఈ సాంగ్ పై ముందు నుంచీ అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. బట్ పాట చూస్తే ఆ అంచనాలను అందుకుందా అంటే లేదు అనే చెప్పాలి. ఎమ్ఎమ్ కీరవాణి స్థాయికి తగ్గ పాటలా కనిపించడం లేదు. ఓ సాధారణ ట్యూన్ తో పాటు సాధారణమైన సాహిత్యంతో కనిపిస్తోంది. ఆర్కెస్ట్రైజేషన్ సైతం మెప్పించలేదు. వీధిలో వెళుతోన్న ఓ అమ్మాయిని చూస్తూ డైరెక్ట్ గా ఆమె ‘వెల’ఎంత అని ఆమెనే అడగడం నుంచి ప్రారంభమైన సాంగ్ ఇది. పాటలోని మొదటి లైన్స్ చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది.
‘పోతుంటే అలా అలా బజార్ మొత్తం గోలే గోలే.. కోపంగానూ చూడకు అలా పేలకోయి ఏ ఫిరంగిలా.. ’.. ‘ఏం కావలోయ్ పిల్లా మెరుస్తున్నావ్ తళా తళా.. ఎంతో చెప్పూ తమరి వెలా.. మొహరీలా వరహాలా..’ అని అడగటం.. దానికి ఆమె.. తార తార నా కళ్లు వెన్నెల పూత నా ఒళ్లు.. ఆకాశాన్ని ఎంతకని వెలకడతారు.. ’ అని బదులిస్తుంది. సో.. అలా ఆమెను టీజ్ చేసిన వారిని తన ‘రేంజ్’ గురించి చెప్పుకోవడం అనే కాన్సెప్ట్ ఈ పాట చుట్టూ కనిపిస్తుంది. కాకపోతే ఏదో సీక్వెన్స్ లో ఆమెను ఎరగా వేసి కథానాయకుడు తన పని సాధించే క్రమంలో ఉండేచ్చేమో కానీ.. చాలా హైప్ పెంచిన ఈ పాట ఏమంత గొప్పగా లేదు అనే చెప్పాలి.
శ్రీ హర్ష ఈమని రాసిన ఈ గీతాన్ని లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ పాడారు. శోభి పూల్రాజ్ కొరియోగ్రఫీ అందించాడు. అదీ అంతగా మెప్పించలేదు. మొత్తంగా సినిమాలో సన్నివేశ పరంగా ఎలా ఉంటుందో కానీ.. ఇలా మాత్రం ఇదో యావరేజ్ సాంగ్ అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com