Hari Hara Veera Mallu : వీరమల్లు రిపేర్స్ కలెక్షన్స్ పెంచుతాయా..?

హరిహర వీరమల్లు కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. కానీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం దారుణంగా ఉన్నాయని అంతా చెప్పేశారు. అంత నాసిరకమైన గ్రాఫిక్స్ ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరో సినిమాలో కూడా చూడలేదు. ఆదిపురుష్, విశ్వంభర చిత్రాలకు టీజర్ తోనే అలెర్ట్ అయ్యారు. క్వాలిటీ పెంచుకున్నారు. పవన్ మూవీలో ఇలాంటివి కనిపించడం ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. అందుకే మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఇయనా పవన్ ఛరిష్మా వల్ల మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన దిద్దుబాటు చర్యలు రిలీజ్ తర్వాత మొదలుపెట్టింది టీమ్.
సినిమా మొత్తం మార్చడం ఇప్పట్లో అయ్యే పనికాదు. అందుకే మరీ దారుణంగా ఉన్నాయి అనిపించిన సీన్స్ లో విఎఫ్ఎక్స్ ను మార్చారు. కాస్త బెటర్ క్వాలిటీతో ఉండేలా చేశారు. వాటిలో క్లైమాక్స్, బండరాళ్లు పడే సీన్, పవన్ కళ్యాణ్ జెండా ఎత్తి పట్టుకునే సీన్ తో పాటు అడవిలో యాగం చేస్తున్నప్పటి సన్నివేశాల్లో గ్రాఫిక్స్ క్వాలిటీని బెటర్ చేశారట. దీంతో కొత్తగా చూస్తున్నవాళ్లు 'బానే ఉంది కదా' అనుకుంటున్నారు. ఏ సినిమాకైనా సోమవారం అనేది పెద్ద పరీక్ష. అసలే డివైడ్ టాక్ వచ్చిన హరిహర వీరమల్లు వంటి చిత్రాలకు అది విషమ పరీక్ష అవుతుంది. అయినా క్వాలిటీ పెంచార కాబట్టి.. కలెక్షన్స్ కూడా పెరుగుతాయా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com