Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..?

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..?
Hari Hara Veera Mallu : పవర్ స్టార్.. ఈమధ్య ఒకేసారి రెండు, మూడు సినిమాలను పూర్తిచేస్తున్నాడు.

Hari Hara Veera Mallu : ఎప్పుడూ ఒక సినిమా తర్వాత మరొక చిత్రాన్ని పట్టాలెక్కించే పవర్ స్టార్.. ఈమధ్య ఒకేసారి రెండు, మూడు సినిమాలను పూర్తిచేస్తున్నాడు. ఈ లిస్టులో పవన్ ఎంతో ప్రెస్టేజియస్ గా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 'హరి హర వీరమల్లు'. 17వ శతాబ్దం నాటి కథాంశంతో విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చాణక్యుడికి ఉన్న తెలివితేటలు.. తెనాలి రామలింగడుకి ఉన్న హాస్యచతురత.. ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ పాత్రలో కనిపించనున్నాయట. అలా.. ఎంతో వైవిధ్యంగా పవన్ పాత్రను తీర్చిదిద్దాడట డైరెక్టర్ క్రిష్.

ఈ చిత్రంకోసం 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్ ను ఒరిజినల్ కొలతలలోనే వేశారు. కథలో మొఘలుల బ్యాక్ డ్రాప్ ఉండడంతో.. ఆగ్రా కోటకు సంబంధించిన సెట్స్ ను కూడా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలకమైన పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ 60 శాతానికి పైగా పూర్తయ్యింది. తాజాగా.. 'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్ కి సిద్ధమవుతోందట టీమ్.

సెప్టెంబర్ నుంచి ఈ సినిమా న్యూ షెడ్యూల్ ను షురూ చేయనున్నారట. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు పవన్ కళ్యాణ్‌‌ క్యారెక్టర్‌‌‌‌కి సంబంధించిన సీన్స్ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్ క్రిష్. ఇక.. ఆ తర్వాత మిగతా వారి సీన్స్‌‌ని తెరకెక్కించాలనేది చిత్రబృందం నిర్ణయం. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి మరకతమణి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మెగా హీరోస్ కి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన కీరవాణి.. పవర్ స్టార్ సినిమాకి సంగీతాన్నందించడం ఇదే తొలిసారి. మొత్తంమీద.. హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామా 'హరి హర వీరమల్లు' పవన్ కి ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story