Pawan Kalyan : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు

Pawan Kalyan :  హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ హరిహర వీరమల్లు.. క్రిష్ కొంత భాగం షూటింగ్ చేయగా.. మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. బాబీ డియోల్ విలన్ గా నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ చిత్రంలో నోరా ఫతేహీ, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. చాలాకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫైనల్ గా అనౌన్స్ చేశారు. అంతా అనుకుంటున్నట్టుగానే జూన్ 12న వస్తున్నాం అని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలకు ప్రిపేర్ అయిపోవచ్చు అని చెప్పేసినట్టే.

ఇక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ తరహా పాత్రలో నటించాడనేది ముందు నుంచీ వినిపిస్తోన్న మాట. పీరియాడిక్ అంటే ఔరంగజేబ్ కాలం నాటి కథట. ఆ పాత్రలోనే బాబీ డియోలో కనిపించబోతున్నాడు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ అని చెబుతున్నారు. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ మూవీ షూటింగ్ లో చివరి పార్ట్ ను పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెలాఖరులో పూర్తి చేశాడు.

హరిహర వీరమల్లులో విఎఫ్ఎక్స్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ పూర్తి చేయడానికే నానా తంటాలు పడిన టీమ్ ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పడం విశేషం. అలాగే ఈ చిత్రాన్ని పార్ట్ 1 స్వార్డ్ అండ్ స్పిరిట్ అంటున్నారు. సెకండ్ పార్ట్ సంగతేమో కానీ.. ఈ మూవీపై మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అది కాస్తా అయితే అంచనాలు మొదలవుతాయి.

Tags

Next Story