Bindu Madhavi: బిందు మాధవికి యంగ్ హీరో సపోర్ట్.. ఇద్దరూ లవ్‌లో ఉన్నారంటూ టాక్..

Bindu Madhavi (tv5news.in)
Bindu Madhavi: తెలుగమ్మాయి అయినా కూడా కోలీవుడ్‌లో చాలా పాపులారిటీ సంపాదించుకుంది బిందు మాధవి. తెలుగులో కూడా తను పలు సినిమాలతో అలరించింది. కానీ చాలాకాలంగా బిందు మాధవి తెలుగుతెరపై కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రియాలిటీ షోలో తన ఆటను సపోర్ట్ చేస్తూ ఓ యంగ్ హీరో పోస్ట్ పెట్టాడు.
బిగ్ బాస్ నాన్ స్టాప్‌కంటే ముందు బిందు మాధవి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1లో కనిపించింది. అక్కడ తన ఆటతో చివరి వరకు చేరుకున్నా విజేత మాత్రం అవ్వలేకపోయింది. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీలో బిందు మాధవి పర్ఫెర్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అంతా బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ బిందునే కావాలని కోరుకుంటున్నారు.
బిందు మాధవి గేమ్ ప్లాన్‌తో చాలామంది బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకులను ఫిదా చేసింది. అందుకే ఓట్ల విషయంలో కూడా ప్రతీవారం తానే ముందంజలో ఉంటోంది. తాజాగా తన గేమ్‌కు సపోర్ట్ చేస్తూ ఓ తమిళ యంగ్ హీరో తన ట్విటర్‌లో ట్వీట్ చేశాడు. దీంతో ఒకప్పుడు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారన్న రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి.
బిందు మాధవి బిగ్ బాస్ తమిళంలో కంటెస్టెంట్‌గా వెళ్లినప్పుడు యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కూడా అందులో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. అయితే ఈ షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులంతా వీరి మధ్య లవ్ ట్రాక్ మొదలయిపోయింది అనుకున్నారు. అన్ని బిగ్ బాస్ ప్రేమకథల్లాగానే వీరిది కూడా షో అయిపోగానే కనుమరుగయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తాను బిందు మాధవికి సపోర్ట్ చేస్తున్నానంటూ హరీష్ ట్వీట్ చేయడంతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.
Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu 🔥👌🤗#BiggBossNonStopTelugu #ShowStealerBindu
— Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com