Balakrishna : బాలకృష్ణ - హరీష్.. భలే కాంబినేషన్ కదా..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడిప్పుడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ కా బాప్ అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా సంక్రాంతి బరిలో డాకూ మహారాజ్ గా మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతూ అఖండ 2 తాండవం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోందిప్పుడు. బోయపాటి తర్వాత మరోసారి గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చాడు. ఈ కాంబోలో వీరసింహారెడ్డి అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అందుకే బాలయ్య మళ్లీ గోపీచంద్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇవి రెగ్యులర్ గా కనిపిస్తోన్న కాంబినేషన్సే. కానీ ఫస్ట్ టైమ్ హరీష్ శంకర్ కు అవకాశం ఇచ్చాడు అనేదే లేటెస్ట్ న్యూస్.
యస్.. హరీష్ శంకర్ కు తన తర్వాతి సినిమా అవకాశం ఇచ్చాడట బాలకృష్ణ. హరీష్ శంకర్ చివరి సినిమా మిస్టర్ బచ్చన్ బిగ్గెస్ట్ డిజాస్టర్. అయినా బాలయ్య నమ్మాడు అంటే ఆశ్చర్యమేం లేదు. ఇవన్నీ ఆయనకు మామూలే కదా. ఇక హరీష్, పవన్ కాంబోలో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్టే అనుకోవచ్చు. మిస్టర్ బచ్చన్ దెబ్బకు హరీష్ అంటే చాలామంది హీరోలు భయపడుతున్నారు.ఈ టైమ్ లో బాలయ్య ఛాన్స్ ఇవ్వడం అంటే హరీష్ కు అదృష్టమే అని చెప్పాలి. ప్రస్తతం డిస్కషన్స్ లోనే ఉన్నారని చెబుతున్నా.. ఆల్మోస్ట్ ఈ కాంబోలో మూవీ కన్ఫార్మ్ అయినట్టే అంటున్నారు. కన్నడలో యశ్ తో టాక్సిక్ అనే చిత్రాన్ని రూపొందిస్తోన్న కేవీఎన్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు. ఏదేమైనా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఖచ్చితంగా క్రేజీగానే ఉంటుంది. కాకపోతే హరీష్ మళ్లీ రీమేక్ లు అనకుండా సొంత కథతో వస్తే బెటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com