Harish Shankar : వాళ్లందరినీ కాదని.. నన్నే టార్గెట్ చేశారు : హరీశ్ శంకర్

సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకు కొత్త కాదని డైరెక్టర్ హరీశ్ శంకర్ అన్నాడు. సోమవారం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించాడు. ఈ మధ్య కాలంలో రవితేజ చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందన్నారు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని చెప్పాడు. సోషల్ మీడియా మాత్రమే తన లైఫ్ కాదన్నాడు. ‘ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ వారందరినీ కాదని నా ఒక్కడిని అటాక్ చేస్తున్నారు. వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందులోని ఒక డ్యాన్స్ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకొని విమర్శిస్తున్నారు. కానీ ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు అనుకూలంగా ఉండే వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ’ అని హరీశ్ శంకర్ అన్నాడు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com