Harish Shankar : మెగా ఛాన్స్ కొట్టేసిన హరీష్ శంకర్
X
By - Manikanta |24 Sept 2024 2:45 PM IST
దర్శకుడు హరీష్ శంకర్ మరో మెగా ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న హరీష్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసి ఛాన్స్ దక్కించుకున్నాడట. ఇటీవల హరీష్ మెగాస్టార్ తో ఓ యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అదిరిపోయే లైన్ చెప్పాడట హరీష్. ఆ లైన్ చిరుకి కూడా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. విశ్వంభర షూటింగ్ కంప్లీట్ అవగానే హరీష్ సినిమాను మొదలుపెట్టనున్నాడట మెగాస్టార్. ఈ క్రేజీ ప్రాజెక్టుకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com