సినిమా

Harish Shankar: బావా.. నీ కెరీర్‌లోనే 'ది బెస్ట్'.. భీమ్లానాయక్‌పై హరీష్ శంకర్

Harish Shankar: చాలా రోజుల తర్వాత థియేటర్లలో పవన్ హవా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు

Harish Shankar: బావా.. నీ కెరీర్‌లోనే ది బెస్ట్.. భీమ్లానాయక్‌పై హరీష్ శంకర్
X

Harish Shankar: పవన్ మ్యానియా తగ్గలే.. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది.. ఆయన చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఆసక్తి.. ఫ్యాన్స్‌ని ఏమాత్రం నిరాశ పరచని పవన్ అదే పవర్‌తో భీమ్లానాయక్ చేశారు. మొదటి రోజు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది.. సినిమా చూసిన ప్రేక్షకులు పవన్ నటనకు ఫిదా అవుతున్నారు.. ఆయన పాత్రే కాదు అందరి పాత్రలు హైలెట్ అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్.

పవన్‌తో గబ్బర్ సింగ్ చేసి హిట్ కొట్టిన హరీష్.. భీమ్లానాయక్‌పై రివ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో పవన్ హవా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కామెంట్ చేశారు..

ఈ చిత్రానికి ఆయన మ్యూజిక్ బ్యాక్ బోన్ అంటే అతిశయోక్తి కాదు.. ఇది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాదు.. బ్యాక్ బోన్ ఆఫ్ భీమ్లా.. నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్ వర్క్.. ప్రతి సన్నివేశాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానం.. అందుకు అనుగుణంగా నువ్వు మ్యూజిక్ ఇచ్చిన తీరు బాగుంది అని తమన్‌ని హరీష్ ప్రశంసించారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం అని కొనియాడారు.. థియేటర్లలో ఆయన నట గర్జన చూడడం అద్భుతంగా ఉంది. ఈ చిత్రం కోసం పని చేసిన సాగర్ కె. చంద్ర, త్రివిక్రమ్, నాగవంశీ మొత్తం టీమ్ అందరికీ అభినందనలు అని అన్నారు.


ఇక ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రధారి రానా గురించి రాస్తూ.. నీలో నేను కేవలం డేనియల్ శేఖర్‌ని మాత్రమే చూశాను.. అదరగొట్టేశావు. సినిమాలో నీ రోల్ చూసిన తర్వాత.. రానా.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అని మాత్రమే చెప్పాలని ఉంది అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.


Next Story

RELATED STORIES