సినిమా

Harish Shankar : హరీష్ శంకర్‌‌కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్... ఆ రీమేక్ ఫిక్స్.. !

Harish Shankar : పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లాంటి మూవీని తాను చేస్తే ఎంత బాగుండో అని మెగాస్టార్ ఫీల్ అయ్యారంటే ఆ మూవీ ఆయనకీ ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు..

Harish Shankar : హరీష్ శంకర్‌‌కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్... ఆ రీమేక్ ఫిక్స్.. !
X

Harish Shankar : పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లాంటి మూవీని తాను చేస్తే ఎంత బాగుండో అని మెగాస్టార్ ఫీల్ అయ్యారంటే ఆ మూవీ ఆయనకీ ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.. ఆ సినిమాకి తాను పెద్ద అభిమాని అని ఓ ఈవెంట్‌‌లో చెప్పారు చిరంజీవి... ఇప్పుడు ఆ గబ్బర్ సింగ్ మూవీని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్‌‌కి ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్.. ప్రజెంట్ పవన్ కళ్యాణ్‌‌తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు హరీష్.. క్రిష్ మూవీ ఫినిష్ అయ్యాక హరీష్ మూవీ చేయనున్నారు పవన్.. ఈ క్రమంలో ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్‌‌కి ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ వచ్చినట్టుగా ఫిలింనగర్‌‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా లైన్‌‌లో పెట్టాడు చిరు.. అయితే ఇది రీమేక్.. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన బ్రోడాడీ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని డైరెక్ట్ చేసే భాద్యతను హరీష్‌‌కి చిరు అప్పజేప్పినట్టుగా తెలుస్తోంది.

తెలుగు వెర్షన్‌‌కి సంబంధించిన కొన్ని మార్పుల గురించి హరీష్‌‌తో చిరు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్రోడాడీ మూవీ హాక్కులు ప్రజెంట్ సురేష్ ప్రొడక్షన్ వద్ద ఉండడంతో సురేష్ బాబు ఈ మూవీని నిర్మిస్తారా లేదా అన్నది చూడాలి. రీమేక్ స్పెషలిస్ట్‌‌గా మెగా అభిమానిగా హరీష్‌‌కి ఆల్రెడీ ఓ పేరు ఉండిపోయింది. మరి చిరుని హరీష్ ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక ఈ రీమేక్ లో మరో హీరోకి స్కోప్ ఉండడంతో వరుణ్ తేజ్ తో ఆ పాత్రను చేయించాలని చిరు భావిస్తున్నారట.

Next Story

RELATED STORIES