Double iSmart : పూరీ లెజెండ్.. డబుల్ ఇస్మార్ట్ తో పోటీ లేదు.. హరీశ్ శంకర్ హాట్ కామెంట్

Double iSmart : పూరీ లెజెండ్.. డబుల్ ఇస్మార్ట్ తో పోటీ లేదు.. హరీశ్ శంకర్ హాట్ కామెంట్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' టీజర్ అదరగొడుతోంది. టీజర్ రిలీజ్ సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తోంది. వివాదాస్పద ట్వీట్లు, హరీశ్ శంకర్ ఆన్సర్లతో.. ప్రెస్ మీట్ అంతా హాట్ హాట్ గా జరిగింది.

1985-95 జమానాలోని నోస్టాల్జిక్ ఫీల్ ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. రవితేజ భాగ్యశ్రీ బోర్స్ స్వీట్ అండ్ డిలైట్ ఫుల్ రొమాంటిక్ సీక్వెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. తర్వాత టీజర్ రవితేజ ఫోకస్ చేస్తూ, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన టీంతో, పవర్ ఫుల్ వ్యక్తిపై రైడ్ కి లీడర్షిప్ వహించే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ నాస్టాల్టిక్ చార్మ్ గా మలిచారు.

మిరపకాయ్ కంటే మెరుగ్గా ఉండేలా మిస్టర్ బచ్చన్ రూపొందించానని హరీశ్ శంకర్ చెప్పారు. ఈ టైటిల్ కూడా రవితేజ సజెస్ట్ చేశాడని అన్నారు. పూరీ ఓ లెజెండ్ అని.. ఆయన డబుల్ ఇస్మార్ట్ తో తనకు పోటీ లేదని అన్నారు హరీశ్ శంకర్. త్వరలో రామ్ తో తాను సినిమా తీస్తున్నట్టు చెప్పారు.

Tags

Next Story