Harish Shankar : ఉస్తాద్ ఒంటరి పోరాటం..

Harish Shankar :  ఉస్తాద్ ఒంటరి పోరాటం..
X

ఉస్తాద్ భగత్ సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ. మరికొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు వస్తోంది ఈ మూవీ. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ్ నటుడు పార్తీబన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే మామూలుగా ఈ తరహా మూవీస్ విషయంలో ప్రమోషనల్ హడావిడీ అంటూ పెద్దగా కనిపిస్తోంది. రిలీజ్ కు ముందు వరకు కూడా ప్రమోషన్స్ తో నానా హంగామా క్రియేట్ చేస్తుంటారు. బట్ ఈ మూవీ అలా కాదు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే మొదటి నుంచి ఆయనే ప్రమోషన్స్ కు రాడు. అది అందరికీ తెలిసిందే. తర్వాత హీరోయిన్లు, డైరెక్టర్ తో చాలా హడావిడీ చేయడం మామూలే. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఒంటి చేత్తో నెట్టుకు వస్తున్నాడు హరీష్ శంకర్. మొదటి నుంచి తనే ఒక్కడే అయి కనిపిస్తున్నాడు. హీరోయిన్లు ఇంటర్వ్యూస్ ఇచ్చినా వాటి వల్ల సినిమాకు పెద్ద ప్లస్ కాలేదు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ వరకూ ఇంటర్వ్యూస్ కు వెళుతున్నాడు. ఓ రేంజ్ లో మూవీపై బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు.

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మూవీ కాబట్టి ఇంత హడావిడీ చేస్తున్నాడు హరీష్ శంకర్.. అనడానికి లేదు. అతను చేసిన ప్రతి సినిమాపై కూడా అతను అదే స్థాయిలో ప్రమోట్ చేస్తుంటాడు. ఒక్కోసారి బయటి సినిమాల కోసం కూడా ప్రమోషన్స్ చేశాడు. ఓ రకంగా సినిమాపై అతని ప్యాషన్ ను చూపిస్తుంది ఈ తపన. మరి హరీష్ శంకర్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అనేది తర్వాతి విషయం. బట్ అతని ప్రయత్నాలు మాత్రం వంద శాతం కనిపిస్తుంటాయి. మరి ఈ కష్టానికి తగ్గట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ తో బ్లాక్ బస్టర్ తెస్తే.. ఆ క్రెడిట్ లో ఎక్కువ భాగం హరీష్ దే అవుతుంది అనడంలో తప్పేం లేదు.

Tags

Next Story