Harnaaz Sandhu: డ్యాన్స్ షోలో మిస్ యూనివర్స్‌కు అవమానం.. బాలీవుడ్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్..

Harnaaz Sandhu: హర్నాజ్ సంధు.. కొన్నాళ్ల క్రితం వరకు తనెవరో ఎవ్వరికీ తెలియదు. కానీ 20 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం హర్నాజ్ సంధు మోడలింగ్ వరల్డ్‌లో బిజీ అయిపోయింది. పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ షోకు వెళ్లిన హర్నాజ్‌కు అవమానం ఎదురయ్యింది. అక్కడ ఓ బాలీవుడ్ నటి చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మిస్ యూనివర్స్ పోటీల తర్వాత ఇండియాకు వచ్చిన హర్నాజ్ సంధు.. ఐటీబీపీ జవాన్ల కుటుంబాలను కలిసింది. వారితో సరదాగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా పలు ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. అదే క్రమంలో హర్నాజ్‌కు 'ఇండియా గాట్ టాలెంట్ 9'కు ఛీఫ్ గెస్ట్‌గా కూడా హాజరయ్యింది.
హిందీలో టెలికాస్ట్ అవుతున్న ఇండియా గాట్ టాలెంట్ ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకొని 9వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. దీనికి మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్, సింగర్ బాద్‌షా, శిల్పా శెట్టి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ షోకు గెస్ట్‌గా హర్నాజ్ సంధు హాజరయ్యింది.
అయితే ఛీఫ్ గెస్ట్‌గా వచ్చిన హర్నాజ్‌ను శిల్పా శెట్టి, బాద్‌షా కనీసం పలకరించకుండా పట్టించుకోనట్టు ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సంపాదించుకున్న వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ శిల్పా శెట్టి, బాద్‌షాలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com