Aishwarya Rai : అత్తారింటి నుంచి బయటికొచ్చేసిన ఐశ్వర్య.. అయితే ఆ వార్తలు నిజమేనా..?

బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోయారనే పుకార్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో దావానంలా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డిసెంబర్ 15న ఐశ్వర్య రాయ్ తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి విడిగా జీవిస్తోందనే న్యూస్ బయటికి రావడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. బచ్చన్ కుటుంబం నివసించే ఇంటి నుండి ఆమె బయటకు వెళ్లి, విడిగా నివసిస్తోందన్న వాదనలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నిండిపోయింది.
అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా స్ట్రీమింగ్ ఫిల్మ్ 'ది ఆర్చీస్' ప్రీమియర్ షో నుండి ఈ పుకార్లు చుట్టుముట్టడం ప్రారంభించాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మధ్య సంబంధాలు బాగా లేవని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఛాయాచిత్రకారులు ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ నుండి ఐశ్వర్యను బిగ్ బి, ఆమె భర్తతో కలిసి చూడగలిగే చిత్రాలను పంచుకున్నారు.
ఐశ్వర్య రాయ్ గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అంద చందాలతోనే కాదు నటనతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఆమె తన కెరీర్ పీక్‌లో ఉండగానే.. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కూమార్తె. అయితే ఇంత కాలం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోయారంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో గత కొంత కాలంగా హల్ చల్ చేస్తోంది. ఇక గతంలో కూడా కొందరూ సినీ సెలెబ్రీస్ ప్రేమ, పెళ్లితో జీవితాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత వైవాహిక జీవితాన్ని విడాకులతో ముగించిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఈ జంట కూడా చేరనుందా.. అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ప్రియమైన కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో ఈ పుకారు మొదలైంది. ఇప్పుడు మళ్లీ ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకుల వార్త తెరపైకి వచ్చింది. అభిషేక్, ఐశ్వర్య మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు ఈ జంట మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అంటున్నారు. దాంపత్య జీవితంలో సమస్యలు కామన్.. బిడ్డ కోసమైనా ఈ జంట కలిసి ఉంటారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. చూడాలి మరి ఏం జరగుతుందో.. అయితే కొన్నాళ్లుగా ఈ జంట మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని.. ఇప్పుడు విషయం మరింత సీరియస్‌గా మారిందని బచ్చన్ కుటుంబానికి చెందిన సన్నిహితులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com