ETV Prabhakar : ఈటీవి ప్రభాకర్ ఫ్యామిలీ ప్యాక్ స్టార్ట్ చేశాడా

ETV Prabhakar :  ఈటీవి ప్రభాకర్ ఫ్యామిలీ ప్యాక్ స్టార్ట్ చేశాడా
X

చాలా టివి సీరియల్స్ లో నటించినా.. సినిమాలు చేసినా.. ఈటీవీ ప్రభాకర్ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్. మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆకట్టుకున్నాడు. హీరోగా ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. సీరియల్స్ తో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అవకాశాన్ని బట్టి అడుగులు వేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అనేది నిజం. అయితే లేటెస్ట్ గా వచ్చిన బ్రహ్మ ఆనందం మూవీ చూస్తే అందులో తన ఫ్యామిలీ మొత్తంతో కనిపించాడు. అంటే సినిమాలో ఫ్యామిలీ కాదు. తన సొంత ఫ్యామిలీయే సినిమాలో అన్నమాట.

ఈ మూవీలో బ్రహ్మానందంకు కొడుకు(??) పాత్రలో నటించాడు ప్రభాకర్. ఈయన భార్యగా సొంత భార్యే కనిపించింది. కూతురుగానూ సొంత కూతురు దివజ కనిపించడం విశేషం. నిజానికి ఇదో రేర్ మూమెంట్ అని చెప్పాలి. ఎక్కడైనా తండ్రి కొడుకులు సినిమాలో కలిసి నటించడం, తండ్రి కూతురు నటించడం చూశాం. కానీ ఏకంగా కూతురు, భార్య, భర్త వారి వారి పాత్రల్లోనే సినిమాలోనూ కనిపించడం అరుదు కాక మరేంటీ.

బ్రహ్మ ఆనందంలో రాశి అనే పాత్రలో కనిపించిన ప్రభాకర్ కూతురు దివిజలో మంచి ఫీచర్స్ ఉన్నాయి. కథాబలం ఉన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించే సత్తా ఉన్న అమ్మాయిగా కనిపించింది. అలాగే సిస్టర్ రోల్స్ కూ బాగా సెట్ అవుతుంది. ఇక ఆయన భార్య మలయజ కూడా ఉన్నా తన ఫేస్ కూడా సరిగా రివీల్ కాలేదీ సినిమాలో కాకపోతే తనను చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. మదర్ లేదా సిస్టర్ రోల్స్ కు సెట్ అవుతుంది. సో మొత్తంగా ప్రభాకర్ ఫ్యామిలీ ప్యాక్ తో నటించడం స్టార్ట్ చేశాడన్నమాట. మరి ఇది ముందు ముందు కూడా కొనసాగాలంటే ఆయా దర్శకులు ఒప్పుకోవాలి మరి.

Tags

Next Story