Anushka Shetty : ఘాటీ మళ్లీ వాయిదా పడిందా..?

Anushka Shetty :  ఘాటీ మళ్లీ వాయిదా పడిందా..?
X

కొన్ని సినిమాల రిలీజ్ డేట్ లు ఒక సీజన్ కాలం లేటు అంటారు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ రాజా సాబ్ నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, కన్నప్ప, కింగ్ డమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో పెద్ద సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్ లోకి అనుష్క శెట్టి ‘ఘాటీ’కూడా చేరబోతోందా అంటే అవుననే వినిపిస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై ఇప్పటి వరకూ ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. అయ్యేలా కూడా సినిమా టీమ్ ఎప్పుడూ పెద్దగా ప్రయత్నించలేదు. ఆ మధ్య వచ్చిన ఓ పాట సందడి చేస్తుందనుకున్నారు. బట్ ఆ పాటను పట్టించుకున్నవాళ్లే లేరు.

ఘాటీ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేస్తున్నాం అంటూ కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఆ మేరకు ప్రమోషన్స్ కనిపించడం లేదు. నిజం చెబితే అసలు ఈ మూవీ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అనుష్క చాలా రోజుల తర్వాత చేసిన సినిమా. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో సందడి చేసినా.. అది తన ఇమేజ్ కు తగ్గ పాత్ర కాదు. ఘాటీ విషయంలో తనే మెయిన్ లీడ్. అనుష్క మాత్రమే కాదు.. ఇతర కాస్టింగ్ కూడా క్రేజీగా ఉంది. అనుష్కకు జోడీగా తమిళ్ హీరో విక్రమ్ ప్రభు నటించారు.కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారున్నారు. నిజానికి సినిమాల రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే సందడి స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఇంకా పది రోజులే ఉన్న ఘాటీ చిత్రం నుంచి ఎలాంటి ప్రమోషన్స్ కనిపించకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే టైమ్ లో అసలు ఈ 11న విడుదలవుతుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనే అనుమానాలూ లేకపోలేదు. మరోవైపు ఈ మూవీ బిజినెస్ పరంగా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు అనే టాక్ కూడా ఉంది. సో.. బిజినెస్ ప్రాపర్ గా జరిగి ఉంటే ఇప్పటికే సందడి స్టార్ట్ అయ్యేది. కాలేదు అంటే ఖచ్చితంగా ఘాటీ జూలై 11న రావడం కష్టమే అనుకోవచ్చు.

Tags

Next Story