Gopichand : గోపీచంద్ పంథా మార్చాడా ఇప్పటికైనా..?

Gopichand :  గోపీచంద్ పంథా మార్చాడా ఇప్పటికైనా..?
X

ఎంతో టాలెంట్ ఉన్న హీరో. మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టార్.. ఈ కాలపు యాంగ్రీమేన్ గా గుర్తింపు ఉంది. అయితేనేం.. ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేయడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు గోపీచంద్. కొన్నాళ్లుగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నాడు. అందుకు కారణం ఎంచుకునే కథల్లో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో పాటు రొటీన్ మాస్ ఎంటర్టైనర్స్ కు మాత్రమే ఓకే చెబుతుండటం. ఈ ట్రెండ్ లోనే ఆగిపోవడంతో అతనికంటే వెనక వచ్చిన వాళ్లు కూడా ముందుకు దూసుకుపోతున్నారు.

భీమా డిజాస్టర్ తర్వాత గోపీచంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టున్నాడు. అందుకే కొత్త సినిమా కబురు కోసం కొంత కాలం ఆగాడు. ఈ గ్యాప్ లో సరైన కథ ఎంచుకుని వస్తాడేమో అని అంతా ఎదురుచూశారు. చూసినట్టుగానే తనతో రెండు సినిమాలు రూపొందించిన దర్శకుడు సంపత్ నందికి ఓకే చెప్పినట్టు టాక్. దీనికి ముందు ఓ కొత్త దర్శకుడితోనూ ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుంది.

సంపత్ నంది, గోపీచంద్ కాంబోలో గౌతమ్ నందా, సీటీమార్ చిత్రాలు వచ్చాయి. గౌతమ్ నందాపై ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్నారు. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయిందా ప్రాజెక్ట్. సీటీమార్ రొటీన్ అన్న పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా హిట్టెక్కిన మూవీ ఇది.

సో.. మరోసారి ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ప్రస్తుతం సంపత్ నంది శర్వానంద్ తో సినిమా చేస్తున్నాడు. అదవగానే గోపీచంద్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందట. ఈలోగా గోపీ కూడా ఆ కొత్త దర్శకుడి సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

Tags

Next Story