Nithiin : నితిన్ కి అన్యాయం జరిగిందా..?

Nithiin :  నితిన్ కి అన్యాయం జరిగిందా..?
X

స్టార్ హీరో నితిన్ కు అన్యాయం జరిగిందా.. అంటే అవుననే అంటున్నారు చాలామంది. అభిమానులైతే అదే పనిగా ఫీలవుతున్నారు కూడా. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో రూపొందిన రాబిన్ హుడ్ మూవీ ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. ముందు 20నే అనుకున్నా తర్వాత పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పుడు క్రిస్మస్ బరి నుంచి ఈ చిత్రాన్ని తప్పిస్తున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఊహించిందే అయినా.. క్రిస్మస్ కంటే సంక్రాంతి బెటర్ కాబట్టి రాబిన్ హుడ్ ను సంక్రాంతికి విడుదల చేద్దాం అని నితిన్ ను ఒప్పించారట నిర్మాతలు. ముందు క్రిస్మస్ నుంచి తప్పుకోవడానికే నితిన్ ఇష్టపడలేదు. బట్ నిర్మాతలు సంక్రాంతి అనడంతో ఓకే అన్నాడు. బట్ సంక్రాంతికి కాదు.. ఫిబ్రవరిలో విడుదల చేద్దాం అని తాజాగా నితిన్ కు మరో షాక్ ఇచ్చారు నిర్మాతలు.

అసలు రాబిన్ హుడ్ ను క్రిస్మస్ నుంచి ఎందుకు తప్పించారు అంటే.. పుష్ప 2 కోసం. యస్.. పుష్ప 2 ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. బట్ తెలుగు స్టేట్స్ లో వీక్ గా కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని క్రిస్మస్ హాలిడేస్ వరకూ ఉంచితే కొంత రికవర్ అవుతుందనుకుంటున్నారు. అదీ కాక టికెట్ ధరలు కూడా తగ్గించారు కాబట్టి ప్రేక్షకులు వస్తారు అని భావిస్తున్నారు మైత్రీ వాళ్లు. అందుకే తమ బ్యానర్ లోనే రూపొందిన రాబిన్ హుడ్ ను తప్పించారు. సంక్రాంతికి జనవరి 11న విడుదల చేస్తారు అనే టాక్ వినిపించింది. ఆ టైమ్ లో మైత్రీతో పాటు ఏసియన్, సురేష్ బాబు థియేటర్స్ ఖాళీగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ డేట్ ను రాబిన్ హుడ్ కు ఇస్తారు అనుకున్నారు. బట్ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే రామ్ చరణ్ తో పాటు, బాలకృష్ణతో అభిప్రాయ భేదాలు వచ్చే ప్రమాదం ఉందని భావించారేమో.. మైత్రీ వాళ్లు అసలు జనవరి నుంచే లేపేశారు. ప్రస్తుతం ఫిబ్రవరి 14న రిలీజ్ అనే టాక్ వినిపిస్తోంది. బట్ ఫిబ్రవరిలో నితిన్ మరో సినిమా తమ్ముడు విడుదల తేదీ అనౌన్స్ చేశారు. అంటే ఆ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుందన్నమాట.

ఏదేమైనా రాబిన్ హుడ్ రిలీజ్ విషయంలో నితిన్ కు అన్యాయం జరిగిందనే అంటున్నారు. అక్కడికీ నితిన్ నైజాంలో సొంతంగా విడుదల చేసుకుంటా అన్నాడట కూడా. అయినా మైత్రీ వాళ్లు వినలేదు.

Tags

Next Story