Sunny Deol : జాట్ బూమరాంగ్ అయిందా

Sunny Deol :  జాట్ బూమరాంగ్ అయిందా
X

ఏదైనా శృతి మించితే చేదుగానే ఉంటుంది. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసే క్రమంలో ఇలాంటివి చేస్తే అతిగా మారుతుంది అంటారు. అలాగే జాట్ పరిస్థితి కనిపిస్తోంది. మామూలుగా హిందీ సినిమాల గురించి ఇంతలా ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేని, నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తెలుగువాళ్లు కాబట్టే ఇంతలా మాట్లాడుకుంటున్నారు. ఓ సాధారణమైన కథకు గోపీచంద్ తనదైన శైలిలో మాస్ కోటింగ్ అద్దితే దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు హీరో సన్నిడియోల్.

కొన్నాళ్లుగా సౌత్ లో రూపొందుతోన్న మాస్ మూవీస్ కు నార్త్ లో మంచి ఆదరణ కనిపిస్తోంది. చాలామంది హీరోలకు స్ట్రెయిట్ మార్కెట్ కంటే డబ్బింగ్ మార్కెట్ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండాలి. మాస్ సాంగ్స్ కనిపించాలి. అలాంటి చిత్రాలకు అక్కడ ఎక్కవ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆ ట్రెండ్ జవాన్ తోనే ఆగిపోయిందని సికందర్ నిరూపించాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ మూవీ రీసెంట్ గానే డిజాస్టర్ అనిపించుకుంది. ఇందులోనూ కంప్లీట్ గా సౌత్ ఫ్లేవర్ తో కూడిన మాస్ కంటెంట్ ఉంది. అలాగే వచ్చిన జాట్ కు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ టాక్ ఆ స్థాయిలో లేదు.

జాక్ కు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే మౌత్ టాక్ ఏమంత గొప్పగా లేదు. ఇదే ఇబ్బంది పెట్టేలా ఉంది అంటున్నారు. మొత్తంగా నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ వారి మాస్ తెలివిని గ్రహించేశారు అనే చెప్పాలి.

Tags

Next Story