Mokshagna : మోక్షజ్ఞకు హీరోయిన్ దొరికిందా?

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం కూడా రాబోతోంది. అందులో ముందుగా వస్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంటైర్ నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అతను వస్తే టాలీవుడ్ లో ఇప్పుడున్న వారసత్వ లెక్కలు మారిపోతాయనే నమ్మకంతో ఉన్నారు వాళ్లు. చాలాకాలంగా ఊరిస్తూ వచ్చిన మోక్షజ్ఞ తెరంగేట్రం సిద్ధం అవుతోంది. హను మాన్ తో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంచ్ అవుతున్నాడు. నిజానికి బాలయ్యే స్వయంగా మెగా ఫోన్ పట్టి కొడుకును పరిచయం చేస్తాడు అనే వార్తలూ వచ్చాయి. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 పేరుతో రూపొందే సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. బట్ అవేవీ కాకుండా ఫైనల్ గా ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మోక్షజ్ఞ మేకోవర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. పాత్రకు తగ్గట్టుగా స్క్రీన్ టెస్ట్ లో సక్సెస్ అయ్యాడు. ఫోటోజెనిక్ గా కనిపిస్తున్నాడు. త్వరలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్ కార్యక్రమం జరగబోతోంది. అయితే మోక్షజ్ఞ సరసన హీరోయిన్ కూడా ఫైనల్ అయిందనే న్యూస్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. తన కోసం ఓ క్రేజీ బ్యూటీని ఫైనల్ చేశారు అంటున్నారు. తనెవరో కాదు.. శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల చిన్న కూతురు ఖుషీ కపూర్. అక్కడ ఆల్రెడీ నందమూరి హీరో ఎన్టీఆర్ తో సౌత్ కు పరిచయం అవుతోంది. ఇప్పుడు చెల్లి కూడా నందమూరి హీరోతోనే తెరంగేట్రం చేయబోతోందంటున్నారు. ఇంకా అఫీషియల్ గా ఈ న్యూస్ రాలేదు. కానీ ఆల్మోస్ట్ ఖుషీ కపూరే .. మోక్షజ్ఞ మొదటి హీరోయిన్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది త్వరలోనే తేలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com