Nani : నాని మూవీ ఆగిపోయిందా..?

నేచురల్ స్టార్ నాని నాన్ స్టాప్ గా ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. నిజంగా అతనికి ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చిందా లేదా అన్నది వేరే విషయం. బట్ అతని ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. 1980స్ లో.. హైదరాబాద్ లోని ప్యారడైజ్ ఏరియాలో సాగే కథగా ఉండబోతోంది అని టాక్. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తర్వాత సుజీత్ డైరెక్షన్ లో బ్లడీ రోమియో అనే మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ద ప్యారడైజ్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత ఆల్మోస్ట్ మే లేదా జూన్ లో సుజీత్ మూవీ సెట్స్ పైకి వెళుతోంది. అయితే ఇంతకు ముందు కమిట్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్ లో పడిపోయిందట.
శేఖర్ కమ్ముల.. ఇంతకు ముందు నానికి కమిట్ అయ్యాడు. అయితే ఈ కథ విషయంలో మాత్రం నానికి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కారణంగా చాలా సిట్టింగ్స్ కూడా జరిగాయట. అయినా నానికి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారట. దీంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల వేరే హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కొంతమంది హీరోలకు కథలు చెప్పే ప్రయత్నాల్లో ఉన్నాడట. లేదంటే మరోసారి అందరు కొత్త కుర్రాళ్లతోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. మొత్తంగా నానితో శేఖర్ కమ్ముల చేయాల్సిన ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటికైతే ఆగిపోయినట్టేనట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
