Jr. NTR ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బాగా తగ్గిందా..

Jr. NTR  ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బాగా తగ్గిందా..

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడు. మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో. ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి తన నటనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన ప్రతిభావంతుడు. అన్నిటికీ మించి తెలుగు వారి ఆరాధ్యదైవంగా చెప్పుకునే ఎన్టీఆర్ మనవడు. ఇన్ని ఉన్న జూనియర్ తాత ప్రతిభను పుణికిపుచ్చుకుని తనకంటూ తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా సిట్యుయేషన్ చూస్తుంటే అతని ఫ్యాన్ బేస్ తగ్గిందేమో అనిపించక మానదు. ఇలా అనిపించడానికీ కారణం ఉంది.

ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే నెలల ముందు నుంచే హడావిడీ ఉండేది. ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో కనిపించేది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్ వరకూ ఇతర హీరోలను మించిన హడావిడీ చేయాలనే ప్లానింగ్స్ ఉండేవి. బట్ ఇప్పుడవేం కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు లోకల్ ఫ్యాన్స్ నుంచి పెద్ద సపోర్ట్ ఏం కనిపించడం లేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 1 చేస్తున్నాడు యంగ్ టైగర్. ఏప్రిల్ 5నుంచి అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయి.. మళ్లీ సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయింది. అయితే ఈ సినిమా గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. ఎందుకు లేట్ అవుతుందని కానీ.. ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా ఎందుకు రాలేదు. ఎక్కడ ఆలస్యం అవుతోంది అన్న అంశాల గురించి ఆరా తీసే అభిమానులే లేరు.

ఇంతకు ముందు ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఇలాగే జరిగితే ఆ హీరోల అభిమానులు ఏకంగా నిర్మాతలను నిలదీస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ధర్నాల వరకూ వెళ్లారు. బట్ ఎన్టీఆర్ ను పట్టించుకునే ఫ్యాన్సే లేరిప్పుడు. ఇంత పెద్ద స్టార్ అని చెబుతున్న ఎన్టీఆర్ మూవీ విడుదలకు రెండు నెలలే ఉంది. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒక్క పాటా రాలేదు. ఆ మధ్య వచ్చిన చిన్న టీజర్ తప్ప వేరే ఏం లేదు. అసలామాటకొస్తే.. దేవరపై ఎవరికీ ఆసక్తి లేదు అంటున్నారు. అందుకే ఇప్పటి వరకు మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు. అలా క్రియేట్ కావాలంటే ఫ్యాన్స్ పూనుకోవాలి. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది. అతనిపై అసహ్యమైన మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. దీనికి కౌంటర్ గా ఫ్యాన్స్ నుంచి పెద్ద రియాక్షన్ ఏం కనిపించడం లేదు. అదే అన్ని అనుమానాలకు కారణం. ఒకప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడేమయ్యారు అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం అవుతోంది.

నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లు కేంద్రంగా కొందరు వీరాభిమానులు పనిచేశారు. బట్ కొన్నాళ్లుగా మారిన పరిస్థితులు.. ఆ పార్టీపై, వ్యక్తులపై, ఆఖరికి కుటుంబ సభ్యులపైనా వైసీపీ చేసిన నీచ విమర్శలపైనా ఎన్టీఆర్ స్పందన చూసిన తర్వాత చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఇదే విషయం ఇన్ డైరెక్ట్ గా తాజాగా ఏపి అసెంబ్లీలో కూడా సత్య ప్రకాష్ అనే ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించాడ. దీన్ని బట్టి చూస్తే దేవర రిలీజ్ టైమ్ కు ఎన్టీఆర్ గత ఇమేజ్ కు భిన్నమైన సిట్యుయేషన్ ఎదురయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇటు దేవర అప్డేట్స్ కోసం చూసినా.. ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పరంగా చూసినా.. ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ డ్రాస్టిక్ గా తగ్గిందని మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.

Tags

Next Story