Raviteja : రవితేజ మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..

Raviteja : రవితేజ మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..
X

మాస్ మహరాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ బాలీవుడ్ లో 2018లో వచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్. 1980స్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. రీమేక్ మూవీస్ అంటే హరీశ్ శంకర్ చాలా మార్పులు చేస్తాడు. స్క్రిప్ట్స్ లో ఇంప్రవైజేషన్ ఉంటుంది. హీరోలకు తగ్గట్టుగా డైలాగులూ మార్చేస్తాడు. ఇంతకు ముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేశ్ వంటి సినిమాల్లో అతని మ్యాజిక్ చూశాం. ఇప్పుడు రైడ్ ను రవితేజ ఇమేజ్ కు అనుగుణంగా మార్చి ‘మిస్టర్ బచ్చన్’గా రూపొందిస్తున్నాడు. ఒకనాటి బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ కూతురు భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. రీసెంట్ గా వచ్చిన ఒక పాటకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కొత్తమ్మాయిలోని గ్లామర్ యాంగిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు హరీశ్ శంకర్.

ఇక చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో నిన్నటి వరకూ ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు విడుదల చేయాలా అనే క్లారిటీ లేదు. ముందు వీళ్లు ఆగస్ట్ 15 అనుకున్నారట. కానీ అప్పటికి ఆ డేట్ లో పుష్ప 2 ఉంది. ఆ మూవీ పోస్ట్ పోన్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ డే కి డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. దీంతో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీ తంగలాన్, తెలుగు నుంచి ఆయ్, 35 చిన్న కథ కాదు వంటి చిన్న సినిమాలూ ఉన్నాయి. అయినా మాస్ రాజా ఎంట్రీ ఇస్తే లెక్కలు మారతాయి కదా. అందుకే ఆ లెక్కలే మార్చబోతున్నారని టాక్.

ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే డేట్ ఫిక్స్ అయినట్టు టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఒకవేళ మిస్టర్ బచ్చన్ వస్తే ఇప్పటి వరకూ షెడ్యూల్ అయిన సినిమాల్లో మార్పులు రావొచ్చేమో. కానీ రవితేజ మూవీని ఇంత హడావిడీగా విడుదల చేయాలనుకోవడం వెనక ఓటిటి ప్లాట్ ఫామ్ ఒత్తిడి కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇలాంటి ఒత్తిళ్లకు తల వంచితే రాబోయే రోజుల్లో వాల్లే అన్నీ డిసైడ్ చేస్తారేమో.

Tags

Next Story