Jana Nayagan : జన నాయకన్ ఇంకా సెన్సార్ ప్రాబ్లమ్ క్లియర్ కాలేదా..?

Jana Nayagan :  జన నాయకన్ ఇంకా సెన్సార్ ప్రాబ్లమ్ క్లియర్ కాలేదా..?
X

విజయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు. దీంతో అతని లాస్ట్ మూవీ జన నాయకుడు రిలీజ్ కు రెడీ అయిపోవడం ఖాయం అనుకున్నారు చాలామంది. అనుకున్నట్టుగానే ఈ చిత్రం జూన్ 19న విడుదల కాబోతోంది అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ డేట్ ఫిక్స్ అంటూ చెబుతున్నారు. అదే టైమ్ లో అదే రోజున విడుదల కాబోతోన్న సమంత మా ఇంటి బంగారం కూడా విడుదల కాబోతోంది కాబట్టి సమంతకుస సమస్యలు తప్పవు అంటున్నారు. బట్ అసలు విషయం ఏంటంటే.. జన నాయకుడు మూవీ రిలీజ్ కు ఇంకా రెడీగా లేదు.

జన నాయకుడు విజయ్ కి లాస్ట్ మూవీ. మామూలుగా అయితే ఈ యేడాది జనవరి 9న విడుదల కావాల్సిన మూవీ ఇది. బట్ చాలా కారణాల వల్ల ఆలస్యం అయింది. అందుకు ప్రధాన కారణం ఈ మూవీకి ఇప్పటి వరకు సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. ఇప్పటికీ సెన్సార్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కారణంగా సెన్సార్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదు. తాజాగా ఈ మూవీ నిర్మాత కూడా అదే విషయాన్ని చెప్పాడు. దీంతో ఈ మూవీకి ఇంకా సెన్సార్ క్లయరెన్స్ ఇవ్వలేదు అని తేలింది. మరి జూన్ 19న రిలీజ్ అన్నారు కాబట్టి ఈ మూవీకి ఆ టైమ్ వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. వీరితో పాటు మూవీ టీమ్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

ఇక ఈ చిత్రంలో విజయ్ తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేశాడు. మొత్తంగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి రకరకాల మీడియంలో చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఇది అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు అనేది మాత్రం వాస్తవం.

Tags

Next Story