Mahesh Babu : మహేష్ - రాజమౌళి మూవీ స్టార్ట్ అయిందా...

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం చాలాయేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఆ మూమెంట్ వచ్చేసింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే టైమ్ కు రాజమౌళికి ప్యాన్ వాల్డ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా లీగ్ లో కూడా లేని మహేష్ కు ఇది డబుల్ బొనాంజాలాంటిది అని చెప్పాలి. హాలీవుడ్ కటౌట్ లాంటి మహేష్ కు రాజమౌళి లాంటి డైరెక్టర్ తోడైతే ఇంకా మనోడి రేంజ్ ను ఆపడం ఎవరి తరం అవుతుంది.
అయితే ఈ కాంబినేషన్ లో సినిమా అయితే అనౌన్స్ అయింది కానీ.. షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏం లేవు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింటింగ్ గా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అనేది కూడా తెలియకుండా ఉంది. ఈ టైమ్ లో ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ ఒకటి వచ్చేసింది. అంతా అనుకుంటున్నట్టు రాజమౌళి ప్రస్తుతం ఖాళీగా ఏం లేడు. ఆ మాటకొస్తే మహేష్ కూడా పనిలోనే ఉన్నాడు. ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు కదా. అందుకే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన రాజమౌళి మూవీస్ కు మంచిన యాక్షన్ డోస్ ఈ మూవీలో ఉండబోతోందట. అటు మహేష్ కూ ఇవి కొత్తే. అందుకే డైరెక్ట్ సెట్స్ లో ఇబ్బంది పడటం కంటే ముందుగా కొన్ని రిహార్సల్స్ చేసుకుంటే బెటర్ అని ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్స్ ల రిహార్సల్స్ జరుగుతున్నాయి.
పాటల విషయంలో మామూలుగా ఇలాంటి రిహార్సల్స్ జరుగుతుంటాయి. ఫైట్స్ కోసమూ జరుగుతున్నాయంటే జక్కన్న ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా పక్కా ప్లానింగ్ తోనే రాజమౌళి సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ లేట్. సో.. సినిమా ఎప్పుడు వచ్చినా.. బ్లాక్ బస్టర్ కు మించి అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com