Jailer 2 : జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ గెస్ట్ అప్పీరియన్స్ లో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 మొదలుపెట్టాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సారి కూడా ఆ గెస్ట్ రోల్స్ రిపీట్ కాబోతున్నాయి. మరోసారి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రజినీకాంత్ కూలీ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. వసూళ్లు వచ్చినా.. కంటెంట్ విషయంలో కామెంట్స్ వచ్చాయి. అందుకే జైలర్ 2తో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో వర్క్ చేస్తున్నాడు దర్శకుడు.
ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చిందని కోలీవుడ్ లో న్యూస్ వస్తున్నాయి. జైలర్ 2ను 2026 ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఆ డేట్ లో ముందుగా సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో రూపొందుతోన్న ‘కరుప్పు’ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ ఆ మూవీ ఆ టైమ్ కు రావడం కష్టమేనని తెలిసిందట. లేదా ముందే విడుదలయ్యే అవకాశాలూ ఉన్నాయట.అందుకే ఏప్రిల్ 14న జైలర్ 2 ను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్.ఈ డేట్ ఫిక్స్ అయితే సమ్మర్ లో సూపర్ స్టార్ విధ్వంసం చూస్తారన్నమాట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com