Vijay Deverakonda : విజయ్ దేవరకొండ జాగ్రత్త పడ్డాడా.. మారాడా..?

Vijay Deverakonda :  విజయ్ దేవరకొండ జాగ్రత్త పడ్డాడా.. మారాడా..?
X

కొంతమంది మాట్లాడుతుంటే మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ అటెన్షన్ కూడా వారిపైనే ఉంటుంది. ఆ మాటల్లో ఎక్కడో చోట కాంట్రవర్శీ క్రియేట్ అవుతుంది.. లేదంటే సెల్ఫ్ డబ్బా ఉంటుంది.. అదీ కాదంటే ఫలానా వారికి నచ్చనిదేదో మాట్లాడతారు. ఆ ఫలానా బ్యాచ్ మాత్రం ఇందుకోసమే కాచుకుంటుంది. ఆ కారణంగానే కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది. అతనికి వ్యతిరేకంగా మీమ్స్ అవుతుంది. అఫ్ కోర్స్ అతను కూడా వేదికలపై అవసరానికి మించిన అతి చేస్తుంటాడు. యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే అతన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం స్వీట్ పర్సన్ అంటారు. బట్ ప్రేక్షకులంతా అతన్ని దగ్గరగా చూడలేరు కదా. అతను వేదికలపై ఎలా కనిపిస్తున్నాడో అదే అతను అనుకుంటారు కదా..? అదే జరిగింది. అందుకే విజయ్ పై ఇంత నెగెటివిటీ వచ్చింది. కామన్ ఆడియన్స్ కూడా ఆ నెగెటివిటీని పాజిటివ్ గానే చూశారు. బట్ ఈ సారి ఆ తప్పులు చేయలేదు. జాగ్రత్తగా మాట్లాడాడు. ఆచితూచి పదాలు ఎంచుకున్నాడు. యస్.. తాజాగా జరిగిన కింగ్ డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నోరు చాలా అదుపులో కనిపించింది. కేవలం తన సినిమా, ఫ్యాన్స్, తోటి నటులు, టెక్నీషియన్స్.. ఇంత వరే పరిమితం అయ్యాడు. నెగెటివ్ అయ్యేలా ఒక్క మాట కూడా జారలేదు. చాలా కంట్రోల్డ్ గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కూడా ‘‘హమ్మయ్య’’ అనుకున్నారంటే అతిశయోక్తి కాదు.

కింగ్ డమ్ మూవీ అతనికి చాలా కీలకం. ఈ మూవీ ఖచ్చితంగా విజయం సాధించాల్సిన స్థితిలో ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అయితే అతని లీగ్ కూడా మారుతుంది. అలాగని టాప్ రేస్ లోకి వస్తాడు అని కాదు. ఆ రేస్ కు దగ్గరవుతాడు అని. మరో రెండు మూడు బ్లాక్ బస్టర్స్ పడితే టైర్ 2 ను దాటేస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన కింగ్ డమ్ చాలా పెద్ద కాన్వాస్ తోనే వస్తోందని ట్రైలర్ చూస్తే అర్థం అయింది. అయితే సినిమాలో అంతకు మించిన సర్ ప్రైజ్ లు చాలానే ఉంటాయని ప్రామిసింగ్ గా చెబుతున్నారు. ఇవన్నీ వర్కవుట్ అయ్యి, ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఎంత నెగెటివిటీ ఉన్నా.. సినిమా ఆగదు. బ్లాక్ బస్టర్ అయిపోతుందంతే.

మొత్తంగా విజయ్ దేవరకొండ జాగ్రత్త పడ్డాడా లేక పూర్తిగా మారాడా అనేది తర్వాత కానీ ఇప్పటికైతే ఇబ్బంది లేకుండా బయట పడిపోయాడు.

Tags

Next Story