Tollywood : బాలయ్య, బోయపాటి లాగే హ్యాట్రిక్ కొట్టిన హీరోలు, దర్శకులు వీళ్ళే..!
Tollywood : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అఖండ.. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన మూడో చిత్రం

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అఖండ.. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందిచారు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాలతో నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సంపాదించుకొని దూసుకుపోతుంది. ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. అయితే వీరిలాగే హ్యాట్రిక్ కొట్టిన హీరోలు దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..!
1. హరికృష్ణ _ వైవిఎస్ చౌదరి
వీరి కాంబినేషన్ లో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య మూడు చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
2. ఎన్టీఆర్- రాజమౌళి
వీరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహద్రి, యమదొంగ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ చిత్రం రాబోతుంది.
3.రవితేజ- పూరి జగన్నాధ్
వీరి కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు వచ్చి హైట్రిక్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన దేవుడు చేసిన మనుషులు, నేనింతే చిత్రాలు వచ్చి ఫ్లాప్ అయ్యాయి.
4. రవితేజ-మలినేని గోపీచంద్
డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో హైట్రిక్ కొట్టి హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు రవితేజ, మలినేని గోపీచంద్
5. అల్లు అర్జున్ - త్రివిక్రమ్
వీరి కాంబినేషన్ లో జులాయి, s/o సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
RELATED STORIES
Natural Mouth Wash: నోటి ఆరోగ్యానికి ఇంట్లోనే మౌత్ వాష్.. తయారీ ఈ...
15 Aug 2022 8:51 AM GMTBadam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMT