Kantara sequel: కాంతారా సీక్వెల్ ఉంటుందా.. రిషబ్ ఒప్పుకుంటాడా..

Kantara sequel: కాంతారా సీక్వెల్ ఉంటుందా.. రిషబ్ ఒప్పుకుంటాడా..
Kantara sequel:చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంత సులువేం కాదు. బలమైన కంటెంట్ ఉండాలి.

Kantara Sequel: చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంత సులువేం కాదు. బలమైన కంటెంట్ ఉండాలి. అది యూనిక్ గా కనిపించి.. అందరు ఆడియన్స్ ను మెప్పించాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఇక్కడ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే ఆ కంటెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తే అది సాధ్యం అవుతుంది..? అలా చేశారు కాబట్టే కాంతార మేకర్స్ కలెక్షన్ల సునామీని చూశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.


కాంతార.. ఎవరూ ఊహించని విధంగా ఈ యేడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా. కన్నడ సినిమాగా వచ్చి.. డబ్ అయిన అన్నిచోట్లా విపరీతమైన డబ్బులు తెచ్చిన సినిమా. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ.. దర్శకత్వం చేసిన ఈ చిత్రానికి యూనానిమిస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కెజీఎఫ్ నిర్మాతలు రూపొందించిన కాంతారకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా మెయిన్ హైలెట్ గా నిలిస్తే.. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో కనిపించే స్థానిక సంప్రదాయం దేశంలో ప్రతి ప్రాంతానికి కనెక్ట్ కావడంతో ప్రేక్షకులంతా ఓన్ చేసుకున్నారు.



అలా పెద్ద విజయం సాధించిందీ చిత్రం. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో అతి పెద్ద విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి హీరోగా, దర్శకుడుగా రిషభ్ శెట్టి అందుకున్న పారితోషికం కేవలం 4 కోట్లు మాత్రమేనట. అయితేనేం అతని అసమాన ప్రతిభతో కన్నడ సినిమాను తల ఎగురవేసుకునేలా చేశాడు.


రిషభ్ ఒప్పుకుంటే కాంతారకు సీక్వెల్ తీస్తాం అంటున్నారు. సీక్వెల్ లేదా.. ప్రీక్వెల్ అయినా ఓకే.. ఎంత బడ్జెట్ అయినా పెడతాం అంటున్నారు. అందుకు తగ్గ సరంజామా కూడా ఈ చిత్రానికి కనిపిస్తోంది. కాకపోతే సీక్వెల్ చేస్తే మాత్రం ఇంక కొత్తగా చూడాల్సింది ఏముంటుందీ..? అనేదే పెద్ద ప్రశ్న. సినిమా చివర్లో పంజుర్లీగా మారిన హీరో తను కూడా తండ్రిలాగానే వనదేవత ఒడిలో కలిసిపోతాడు. దానికి ముందు తన భార్య ప్రెగ్నెంట్ అని చూపిస్తారు. ఆ పిల్లాడే మళ్లీ హీరో అవుతాడు.



కట్ చేస్తే మరోసారి అడవికి, ఆ అడవిని నమ్ముకున్న వీరి తెగకు ఇబ్బంది అవుతుంది. అలా ఇతనూ పంజూర్లీగా మారతాడు. ఇంతకు మించి ఇంకేం కొత్తదనం ఉంటుందీ అనిపిస్తుంది. అందుకే కాంతారకు సీక్వెల్ అంటే చాలామంది ఇంకేం చూస్తాం అంటున్నారు. మరి దర్శకుడు రిషభ్ కు ఈ ఆలోచన ఉందో లేదో కానీ.. ప్రస్తుతం అతను వెకేషన్ లో ఉన్నాడు. వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాం అంటున్నారు ప్రొడ్యూసర్స్.

Tags

Read MoreRead Less
Next Story