Patang Movie : జిందగీ ఉల్టా తిరిగిందే.. పతంగ్ సాంగ్

పూజిత్, ప్రణవ్, ప్రీతి ప్రధాన పాత్రల్లో ప్రణీత్ పత్తిపాటి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ‘పతంగ్’. హైదరాబాద్ నేపథ్యంలో వస్తోన్న మరో బ్యూటీఫుల్ స్టోరీ అని ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే అర్థం అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కంప్లీట్ గా ఆర్గానిక్ ట్యూన్ తో బ్యూటీఫుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో వినగానే వెస్ట్రన్ సాంగ్ లా అనిపించినా.. కాస్త జాగ్రత్తగా చూస్తే అందమైన సాహిత్యం కూడా కనిపించేలా ఉందీ పాట. ఓ రకంగా యూత్ కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. పాటలో వీళ్లు వాడిన కలర్స్, స్కెచెస్ చూస్తే రవిబాబు దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఎలాగైతే ఇన్నోవేటివ్ గా కనిపించాడో.. ఈ దర్శకుడూ అలాగే అనిపిస్తున్నాడు.
ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటను పాడటమే కాదు.. రాసింది కూడా అతనే కావడం విశేషం. ‘హే ఉన్నట్టుండి గా జిందగీ ఉల్టా తిరిగిందే.. అనుకోనంతగా ఈ స్టోరీ డ్రమాటిక్ అయిందే..’ అంటూ మొదలైన ఈ పాటలో ‘మార్నింగ్ లేస్తే చాలే.. ముంతకల్లు తాగినట్టే తేలే.. హఠాత్తుగా ఏదో జర్రమొచ్చినట్టుగా ఒళ్లు అంత సర్రుమంటూ కాలే..’అనే సింపుల్ వర్డ్స్ తో ఆకట్టుకునేలా ఉంది.
పాటలోనే ఓ చోట క్యారమ్ బోర్డ్ ముందు ఇద్దరు అబ్బాయిలు ఎదురెదురుగా కూర్చుకుంటే మరోవైపు ఉన్న అమ్మాయి ఏ కాయిన్ కొట్టాలో తేల్చుకోలేక ఇబ్బంది పడే షాట్ ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని.. అర్థం అవుతోంది. ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమకు ఓకే చెప్పాలో తేల్చుకోలేని అమ్మాయి చుట్టూ సాగే కథనంలా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ పాట మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది. యూత్ ఫుల్ సాంగే అయినా మ్యూజిక్ లో వెస్ట్రన్, లిరిక్స్ లో లోకల్ ను మిక్స్ చేసి ఓ కొత్త అనుభూతి వచ్చేలా కంపోజ్ చేశాడు జోస్ జిమ్మీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com