Bheemla Nayak: 'భీమ్లా నాయక్' హిందీ రిలీజ్ ఫిక్స్.. పవన్‌కు డబ్బింగ్ చెప్పనున్న యంగ్ హీరో..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ను కేవలం ప్రాంతీయ భాషా చిత్రంగానే విడుదల చేసింది మూవీ టీమ్. అయితే ఇప్పటికీ మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు దాటింది. ఈ వారం రోజుల్లో భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ముందుగా అనుకున్నట్టుగానే భీమ్లా నాయక్‌ను హిందీలో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల భీమ్లా నాయక్ హిందీ వర్షన్ ట్రైలర్ కూడా విడుదలయ్యింది.
భీమ్లా నాయక్ హిందీ వర్షన్ ట్రైలర్ విడుదలయిన కాసేపట్లోనే లక్షల్లో వ్యూస్‌ను సంపాదించుకుంది. అసలైతే ఈ సినిమా తెలుగులో విడుదలయిన రోజే హిందీలో కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల హిందీ విడుదల వాయిదా పడింది. అయితే త్వరలోనే ఈ సినిమా హిందీలో కూడా విడుదల్వడానికి సిద్ధమవుతోంది. అందుకే భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ కూడా తాజాగా బయటికొచ్చింది.
భీమ్లా నాయక్ హిందీ వర్షన్‌లో పవన్ కళ్యాణ్‌కు డబ్బింగ్ చెప్తున్నాడు గౌరవ్ చోప్రా అనే యంగ్ హీరో. సీరియల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న గౌరవ్.. ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించాడు. అంతే కాకుండా 'థోర్', 'ఎండ్ గేమ్'లాంటి చిత్రాలకు హిందీలో డబ్బింగ్ కూడా చెప్పాడు. ఈ హీరో ఒక తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. అయితే భీమ్లా నాయక్ సినిమాకు డబ్బింగ్ చెప్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది అంటూ గౌరవ్ ట్వీట్ చేశాడు.
Proud to lend my voice to the legend @PawanKalyan for his latest #BheemlaNayak!
— Gaurav Chopra (@gauravchopraa) March 4, 2022
Here is the official Hindi trailer :https://t.co/K3UzNDLg3G#BheemlaNayakTrailer #BheemlaNayakHindi #BheemlaNayakMania
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com