Suriya : సౌత్ లో బిగ్గెస్ట్ లైనప్ ఉన్న హీరో అతనే

టాప్ హీరోల ఎక్కువ సినిమాలు చేస్తుంటేనే ఏ ఇండస్ట్రీ అయిన బావుంటుంది. ఒకప్పుడు అన్ని భాషల హీరోలూ యేడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేసేవారు. ట్రెండ్ మారింది. ఇప్పుడు ఒక్క మూవీ వస్తే గొప్ప అన్నట్టుగా మారింది. కాకపోతే కొంతమంది లైనప్ మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కానీ అవి రిలీజ అవడం కూడా అంతే. యేడాదికోటి చొప్పున వస్తుంటాయి. అయినా ఆ లైనప్ చూస్తే ఫ్యూచర్ లో వాళ్ల రేంజ్ ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం సౌత్ లో.. ఆ మాటకొస్తే ఇండియాలోనే బిగ్గెస్ట్ లైనప్ ఉన్న హీరో ఎవరూ అంటే డౌట్ లేకుండా తమిళ్ టాప్ స్టార్ సూర్యనే.
సూర్య అంటే కంట్రీ మొత్తం అభిమానిస్తారు. సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు సూర్య. ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ కావాల్సిన సూర్య కాస్త ఆలస్యంగా ఆ లీగ్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఆల్రెడీ కమల్ హాసన్ విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించిన కాసేపు అదరగొట్టిన సూర్య ఇప్పుడు కంగువాతో రాబోతున్నాడు. ఈ దసరా బరిలో అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. దీంతో పాటు అతని నెక్ట్స్ మూవీస్ లైన్ అప్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పైగా ఇవన్నీ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ కావడం విశేషం.
కంగువా తర్వాత సూర్య 44 అనే మూవీ రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్. భారీ స్థాయిలోనే రూపొందుతోందీ మూవీ.
నెక్ట్స్ మోస్ట్ అక్లెయిమ్డ్ డైరెక్టర్ అనిపించుకున్న వెట్రిరమాన్ తో ‘వాడివాసల్’ అనే మూవీ రాబోతోంది. రష్మిక మందన్నా ఈ మూవీలో హీరోయిన్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందబోతోంది.
విక్రమ్ లో కాసేపే కనిపించిన రోలెక్స్ పాత్రను పూర్తి స్థాయి సినిమాగా రూపొందించబోతున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ‘రోలెక్స్ స్టాండ్ అలోన్’ అనే వర్కింగ్ టైటిల్ కూడా ఉందీ మూవీకి. తర్వాత లోకేష్ తోనే ఖైదీ 2 ఉండబోతోంది. దీంతో పాటు విక్రమ్ 3 , కంగువా 2 చిత్రాలు ఉండబోతున్నాయి. విశేషం ఏంటంటే కంగువా సూర్యకు 43వ సినిమా. ఆ తర్వాత 50వ సినిమా వరకూ లైనప్ ఉంది. ఇప్పటి వరకూ చెప్పిన మూవీస్ 49 వరకూ వస్తాయి. ఇక 50వ సినిమాగా ఇరుంబు కాయి మాయావి అనే సినిమా చేస్తాడు. ఏదైమైనా ఓ టాప్ హీరో ఏకంగా ఏడు సినిమాల లైనప్ తో ఉండటం అంటే చిన్న విషయం కాదు. వీటిలో ఏ నాలుగు బ్లాక్ బస్టర్ అయినా.. ప్యాన్ ఇండియా స్థాయిలో సూర్య పేరు మార్మోగిపోతుంది. మరి ఇలాంటి లైనప్ మన హీరోలలో ఎప్పుడు చూస్తామో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com