మెగా హీరోకి మేలు చేసిన హెల్మెట్..
బైక్ మీద వెళ్లేవారిని హెల్మెట్ పెట్టుకోమని పోలీసులు చెవినిల్లు కట్టుకుని పోరుతుంటారు. కానీ అదే ప్రాణాలు కాపాడుతుంటుంది ఏదైనా అనుకోని యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో అదే జరిగింది. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై రైడింగ్‌కి వెళుతున్న సాయి తేజ్ లక్కీగా హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు, డాక్టర్లు అంటున్నారు.
కేబుల్ బ్రిడ్జ్ పై 120 స్పీడ్‌తో వెళుతున్న సాయి తేజ్ ఐకియా దగ్గరలో ప్లై ఓవర్‌పై స్కిడ్ అయింది. బైక్ ఒకవైపు, తేజు ఇంకో వైపు తూలి పడ్డారు. హెల్మెట్ ఉండడం వల్ల తేజూ తలకు గాయం కాలేదు. చాతి, భుజం, కంటి పైభాగం వద్ద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉండడంతో సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయిందని మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఈ ప్రమాదం ఊహించనిది.. ఇలాంటి సమయంలోనే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది.
తేజూ ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకునే బైక్ రైడ్ చేస్తారు. వీకెండ్ సమయంలో తన స్నేహితులు సందీప్ కిషన్, నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ, ఇతర స్నేహితులతో కలిసి తేజూ రైడింగ్‌కు వెళ్లారట. రైడింగ్‌కు వెళ్లే వాళ్లు కచ్చితంగా హెల్మెట్, రైడింగ్ షూట్, నీ ప్యాడ్స్ ధరిస్తారు. కానీ నిన్న నవీన్ విజయ్ కృష్ణను కలవడానికి నటుడు నరేష్ ఇంటికి వెళ్లారు తేజు. అందువల్ల కేవలం హెల్మెట్ మాత్రమే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రైడింగ్ షూస్ కూడా వేసుకుని ఉంటే తేజూకి గాయాల తీవ్రత తగ్గి ఉండేదని యాక్సిడెంట్ చూసిన వారు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com