Hema Malini : హేమమాలినికి అరుదైన గౌరవం..!

Hema Malini :సినీ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెకి ఇండియన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేంద్రం ప్రకటిచింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రకటించారు. భారత చలనచిత్ర రంగానికి హేమ మాలిని చేసిన సేవలకి గాను ఆ అవార్డుని ప్రధానం చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరులో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో హేమమాలినికి ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఆమెతో పాటుగా ఈ అవార్డును CBFC చైర్‌పర్సన్ ప్రసూన్ జోషి కూడా అందుకోనున్నారు. కాగా గత సంవత్సరం ఈ అవార్డును ప్రముఖ నటుడు, దర్శకుడు బిస్వజిత్ ఛటర్జీకి ప్రదానం చేశారు .
Hema Malini @dreamgirlhema and Prasoon Joshi @prasoonjoshi_ will be awarded Indian personalities of the year. They will be honoured at the IFFI in Goa later this month says @ianuragthakur I&B minister @IndianExpress
— Liz Mathew (@MathewLiz) November 18, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com