Meenakshii Chaudhary: టాలీవుడ్‌లో మరో డాక్టర్ ప్లస్ యాక్టర్ కాంబినేషన్..

Meenakshii Chaudhary: టాలీవుడ్‌లో మరో డాక్టర్ ప్లస్ యాక్టర్ కాంబినేషన్..
Meenakshii Chaudhary: 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది మీనాక్షి చౌదరి.

Meenakshii Chaudhary: రవితేజ హీరోగా నటించిన 'ఖిలాడి' సినిమాలోని హీరోయిన్ల గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. ట్రైలర్‌లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి గ్లామర్ డోస్‌కు ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. వీరి గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు. డింపుల్ హయాతి ఐటెమ్ గర్ల్‌గా ప్రేక్షకులకు గుర్తున్నా కూడా మీనాక్షి మాత్రం తాను హీరోయిన్‌గా చేసిన ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో పెద్దగా లైమ్ లైట్‌లోకి రాలేకపోయింది.

అక్కినేని వారి అబ్బాయి సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది మీనాక్షి చౌదరి. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేదు. అందుకే మీనాక్షికి కూడా హీరోయిన్‌గా తగిన గుర్తింపు లభించలేదు. కానీ మొదటి సినిమా విడుదల కాకముందే తనకు రెండో సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.


నాని నిర్మాతగా, అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'హిట్ 2' సినిమాలో మీనాక్షినే హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు మీనాక్షి మోడల్‌గా కెరీర్‌ను కొనసాగించింది. అంతే కాకుండా తాను ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని ఎన్నో టైటిల్స్‌ను కూడా గెలుచుకుంది.

2018లో మిస్ ఇండియా పోటీల్లో మీనాక్షి చౌదరి ఫస్ట్ రన్నర్ అప్‌గా నిలిచింది. అదే సంవత్సరం తాను మిస్ హర్యానా కిరీటం కూడా దక్కించుకుంది. ఇలా పలు పోటీల్లో పాల్గొన్న తర్వాత బాలీవుడ్ మేకర్స్ దృష్టి మీనాక్షిపై పడింది. ముందుగా తనకు 2019లో విడుదలయిన 'ఔట్ ఆఫ్ లవ్' అనే వెబ్ సిరీస్‌లో ఓ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది.


ఈ సంవత్సరం ఖిలాడి, హిట్ 2 వంటి సినిమాలు చేస్తున్న మీనాక్షి.. 'కొలాయ్' అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక మీనాక్షి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తాను స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అది మాత్రమే కాకుండా తాను స్టేట్ లెవెల్ స్విమ్మర్ కూడా. మీనాక్షి చౌదరి ప్రస్తుతం డెంటల్ కేర్‌లో డిగ్రీ చేస్తోంది. ఇప్పటికీ టాలీవుడ్‌లో ఉన్న డాక్టర్ ప్లస్ యాక్టర్ లిస్ట్‌లోకి మీనాక్షి కూడా చేరిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story