Sudigali Sudheer Engagement: సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ అయిన తేజస్వీ నాయుడు బ్యాక్‌గ్రౌండ్..

Sudigali Sudheer Engagement: బుల్లితెరపై చాలా క్రేజ్ ఉన్న ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. ఒక కామెడీ షోలో చిన్న ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్.. అంతకు ముందు మ్యాజిషియన్‌గా కూడా పనిచేశాడు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు చాలామంది బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు కాబట్టి సుధీర్‌ను చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా కూడా తీసుకుంటారు. తాజాగా ఓ షోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది.
సుడిగాలి సుధీర్ అనే పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే మరో పేరు రష్మి. రష్మి తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత సుధీర్‌కు అంతగా గుర్తింపు వచ్చిందని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. వారిది మాత్రమే కాదు.. సుధీర్ కూడా ఎన్నోసార్లు రష్మి లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడు కాదని చెప్పాడు. అయితే ఇంతకాలం వీరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది అనుకున్నవారికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది.
ఇప్పటికీ బుల్లితెరపై ఎన్నో ప్రేమజంటలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో చాలా తక్కువమంది మాత్రమే రియల్ లైఫ్ కపుల్‌గా మారుతున్నారు. అయితే సుధీర్, రష్మి కూడా అలా కేవలం రీల్ లైఫ్‌కు మాత్రమే పరిమితమైన కపుల్ అని కొందరు అనుకున్నా.. వీరు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండు అని కోరుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. అయితే తాజాగా ఓ షోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్ చూసి వీరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు. తను ఒక మోడల్. మోడల్‌గా తాను కొన్ని యాడ్ షూట్స్ కూడా చేసింది. అయితే ఇప్పటివరకు తను పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేదు. కానీ తాజాగా సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా వీడియో బయటికి వచ్చిన తర్వాత తాను ఎవరా అని అందరూ కనుక్కోవడం మొదలుపెట్టారు. మరి ఈ ఎంగేజ్‌మెంట్ అయినా నిజమా.. లేదా ఇది కూడా ఫేకా అని తెలియాలంటే ఈ షో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com