Pawan Kalyan : హరిహర వీరమల్లు ట్రైలర్ పై పవన్ రియాక్షన్

Pawan Kalyan :  హరిహర వీరమల్లు ట్రైలర్ పై పవన్ రియాక్షన్
X

పవన్ కళ్యాన్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతోంది. ట్రైలర్ ను ఈ గురువారం విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ముందుగా ఆ ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ కు చూపించారు. పవన్ తో పాటు ఈ ట్రైలర్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చూడటం విశేషం. ఓ మినీ థియేటర్ లో చూసిన పవన్ చాలా ఎగ్జైట్ అయినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఏ మాత్రం మార్పులు, చేర్పులు చెప్పుకుండా ఓకే చేశాడట. అటు త్రివిక్రమ్ సైతం ట్రైలర్ కట్ చూసి ఇంప్రెస్ అయ్యాడంటున్నారు.

16 వ శతాబ్దానికి చెందిన కథగా వస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ డియోల్ ఆ కాలంలో ఔరంగజేబ్ గా నటించాడు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఇతర పాత్రల్లో నోరా ఫతేహి, సచిన్ ఖేద్కర్, విక్రమ్ జీత్ విర్క్, జిషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ కనిపించబోతున్నారు. అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు మిగతా ఆడియన్స్ లో కూడా క్రియేట్ అవుతాయా లేదా అనేది ఈ ట్రైలర్ వస్తే కానీ తెలియదు. మొత్తంగా పవన్ కూడా ఈ మూవీపై చాలా సంతృప్తిగా ఉన్నాడని సమాచారం.

Tags

Next Story