Balayya Akhanda 2 : బాలయ్య అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే

నందమూరి బాలకృష్ణ కొన్నాళ్లుగా నాన్ స్టాప్ గా బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. వైవిధ్యమైన కథలు, గెటప్ లో అదరగొడుతున్నాడు. అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు. చివరగా వచ్చిన డాకూ మహారాజ్ ఓటిటితో మిగతా రాష్ట్రాల్లో కూడా తిరుగులేని అప్లాజ్ అందుకున్నాడు. ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం అనే మూవీతో చేస్తున్నాడు. చాలా వేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ప్రగ్యా జైశ్వాల్,సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాక్స్ లు బద్ధలు కొట్టిన థమన్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి కీలకమైన అప్డేట్ వినిపిస్తోంది. ఈ డేట్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. అదే నిజమైతే బాలయ్య మరోసారి బాక్సాఫీస్ ను రూల్ చేయడం ఖాయం. ఎందుకంటే అది దసరా హాలిడేస్ కు ముందు రాబోతోంది. యస్.. ఈ సారి దసరా పండగ అక్టోబర్ 2న వచ్చింది. అఖండ 2 ను సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ డేట్ ఫిక్స్ అయిపోయినట్టే అంటున్నారు. అందుకే షూటింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు. దసరాకు వారం ముందు విడుదల అంటే ఆ హాలిడేస్ అన్నీ అఖండ తాండవానికి థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం.
ఇక అదే రోజు సాయిదుర్గా తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటి గట్టు అనే సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. బట్ బాలయ్యకు తేజూ పోటీ ఇవ్వగలడా.. ఒక వేళ కంటెంట్ తో కొట్టినా ఇబ్బందేం లేదు. అంత పెద్ద పండగ ఈ రెండు సినిమాలనూ హ్యాండిల్ చేయగలదు కదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com