NTR - Devara 1 : దేవర టార్గెట్ పెద్దదే..

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తోన్న సినిమా కావడంతో పాటు ఆర్ఆర్ఆర్ తర్వాత అతనికి సోలోగా ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా కూడా కావడంతో భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచాడు ఎన్టీఆర్. ఈ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించబోతున్నారు. దేవరపై ఎక్స్ పెక్టేషన్స్ ఎంత ఉన్నాయో.. అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే దేవర రికవర్ చేయాల్సి కలెక్షన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ స్టామినాకు కూడా టెస్ట్ లాంటిది. కొరటాలకు ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్దగా క్రేజ్ లేదు. ఆ మాటకొస్తే అసలు తెలియదు. ఇటు ఎన్టీఆర్ మాత్రమే కాక బాలీవుడ్ లో సైఫ్అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి వాళ్లు ప్లస్ అవుతారు. మిగతా భాషల్లో సోలోగానే సత్తా చాటాల్సి ఉంటుంది. అందుకే ఇది ఎన్టీఆర్ దమ్మును కూడా చూపించే ఛాన్స్.
ఇక ఏరియాల వారీగా దేవర బిజినెస్ ను చూస్తే అతను సాధించాల్సింది ఎంతో తెలుస్తుంది.
నైజాం - 45 కోట్లు
వెస్ట్ - 6 కోట్లు
ఈస్ట్ - 8 కోట్లు
గుంటూర్ - 8.5 కోట్లు
కృష్ణా - 7 కోట్లు
ఏపి + నైజాం - 113 కోట్లు
కర్ణాటక - 15 కోట్లు
హిందీ - 15
తమిళనాడు - 6 కోట్లు
కేరళ - 50 లక్షలు
ఓవర్శీస్ - 26 కోట్లు
పి & పి - 4.5 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా - 180 కోట్లు
ఇవీ ఏరియాల వారీగా దేవర థియేట్రికల్ రైట్స్. నిజానికి ఎన్టీఆర్ ఖాతాలోఇప్పటివరకూ వంద కోట్ల సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. తెలుగు తర్వాత ఓవర్శీస్, కర్ణాటకలోనే కొంత మార్కెట్ ఉంది తప్ప మిగతా ప్రాంతాల్లో అంత పట్టు లేదు. అందుకే ఇంత తక్కువ రైట్స్ పలికాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సాధించాల్సింది 180కోట్లు షేర్. అంటే గ్రాస్ గా అది 350 కోట్లకు పైనే ఉంటుంది.
సో.. దేవర 350 - 400 కోట్లు సాధిస్తే సాలిడ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ రేంజ్ 500 కోట్ల వరకూ ఉంటుంది. మొత్తంగా దేవరకు ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బట్ సాధిస్తే.. అది ఎన్టీఆర్ స్టామినాకు నిదర్శనంగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com