Game Changer New Update : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇదే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్. అఫ్ కోర్స్ ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కూడా మర్చిపోతున్న టైమ్ ఇది. ఈ టైమ్ లో వినాయక చవితి రోజున స్పెషల్ అప్డేట్ ఇస్తాం అని చెప్పారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. మిగతా ఆడియన్స్ కూడా కొత్తగా ఏం ఇస్తారా అని చూస్తున్నారు. చెప్పినట్టుగానే చెప్పిన టైమ్ కు 3.33 గంటలకు అప్డేట్ వచ్చింది. చాలామంది ఏదైనా సాంగ్ లేదా వీడియో కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేశారు. బట్ అందరి అంచనాలకు భిన్నంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ తో పాటు గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ను ఈ నెలలోనే విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఏ తేదీన విడుదల చేస్తారో మాత్రం చెప్పలేదు. దీంతో చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన అభిమానులు ఈ మాత్రం అప్డేట్ తో ఓస్ ఇంతేనా అనుకుంటున్నారు.
శంకర్ డైరెక్ట్ చేస్తోన్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సునిల్, అంజలి, ఎస్. జే సూర్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ తమన్ .. శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఒకటి ఐఏఎస్.. మరోటి పొలిటీషియన్ గా వినిపించింది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పబోతున్నారు అనుకోవచ్చు. బట్ శంకర్ భారతీయుడు 2 చూసిన తర్వాత ఫ్యాన్స్ ఈ గేమ్ ఛేంజర్ పై మరీ ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఏం పెట్టుకోవడం లేదు అనేది నిజం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com